టాప్ హీరోయిన్ రష్మిక మంధన్న ఇప్పటికీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలసిందే. , తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ కోసం సిద్ధమవుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదీ కూడా టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో ఆమె మళ్లీ స్క్రీన్ పంచుకోనుందన్న వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమిటా ప్రాజెక్టు చూద్దాం.

విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి చేయబోయే ప్రాజెక్ట్‌ను ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సంకృతియన్ దర్శకత్వం వహించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

రీసెంట్ గా మైత్రీ సంస్థ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ జోడీ మరోసారి కలిసి వస్తుందనే సంకేతాల్ని ఇచ్చింది. అందుకు రష్మిక కూడా స్పందిస్తూ – “#HmmLetsSee” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆసక్తిని రేపింది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది అని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇది ఓ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుండడం విశేషం. రాహుల్ ఈ కథను రెండు సంవత్సరాల పాటు శ్రమించి, రీసెర్చ్ చేసి సిద్ధం చేశాడు.

విజయ్ దేవరకొండ ఇందులో డ్యూయల్ రోల్‌లో – తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపించనున్నాడన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కథ 1854 నుంచి 1878 మధ్యకాలం బ్రిటిష్ ఇండియాలో జరుగుతుందని సమాచారం. టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. మరిన్ని ఆసక్తికర అప్డేట్లు త్వరలో రానున్నాయి.

ఈ సినిమాతో మళ్ళీ తెరపై మెరవబోతున్న విజయ్-రష్మిక జోడీ, కాలభైరవ సంగీతం, విజువల్ గ్రాండియర్, డ్యూయల్ రోల్ థ్రిల్ – అంతా కలిపి ఇది ఒక ఎపిక్ సినిమాగా నిలవబోతోందన్న అంచనాలు మొదలయ్యాయి.

ఇంకొన్ని ఆసక్తికర అంశాల కోసం ఈ స్పేస్ లో వెయిట్ చేయండి…

,
You may also like
Latest Posts from