గ్లామర్‌కు, పెర్ఫార్మెన్స్‌కి పరిపూర్ణ సమ్మేళనమైన నటిగా పేరు తెచ్చుకున్నది దీపికా పదుకొణె. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోయిన్‌లలో ఆమె ఒకరు. అనేక విజయవంతమైన సినిమాలతో తనను తాను నిరూపించుకున్న దీపికా, కెరీర్‌లో ఎప్పుడూ పెద్దగా వివాదాల్లో పడలేదు.

సహనటులతో రిలేషన్‌షిప్స్‌పై ఓపెన్‌గా స్పందించిన ఆమె, రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం గర్భవతిగా మాతృత్వ విరామంలో ఉన్నారు.

ఈ సమయంలో ఆమెకు పెద్ద అవకాశం వచ్చిందని వార్తలు వచ్చాయి — సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయిందని. కానీ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, కొన్ని షరతులు, డిమాండ్ల విషయంలో సందీప్ వంగా ఆమెకు ఒప్పుకోలేదట. ఫలితంగా, దీపికా స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీని ఎంపిక చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఇక్కడే ఇంకో కొత్త ట్విస్ట్‌ వచ్చింది — ‘స్పిరిట్’ సినిమాలో బోల్డ్ అండ్ ఇంటిమేట్ సన్నివేశాలు ఉండబోతున్నాయన్న వార్తలు కొన్ని మీడియా హౌజ్‌లు ఊదరగొట్టాయి. ఈ కథనాల వెనుక దీపికా టీం ఉద్దేశపూర్వకంగా నెట్టిన పీఆర్ స్టంట్‌నే ఉందని బాలీవుడ్‌లో ఓ వర్గం విమర్శిస్తోంది.

కానీ ఈ వార్తలపై సందీప్ రెడ్డి వంగా స్వయంగా స్పందిస్తూ, ఇలాంటి అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టారు. ఏ ఒక్కరిని పేరుతో పిలవకపోయినా, ఆయన పోస్టులు దీపికాని టార్గెట్ చేశాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మొత్తం దీపికాని టార్గెట్ చేస్తోంది. ట్విట్టర్‌లో ట్రోల్స్, నెగటివ్ కామెంట్ల వర్షం కురుస్తోంది. దీపికా పదుకొణె కెరీర్‌లో ఇది మొదటిసారి, ఆమె ఇంత తీవ్ర విమర్శల జ్వాలకు గురవుతోంది.

ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట చెబుతున్నారు — “దీపికా స్వయంగా ముందుకొచ్చి, నిజమెవ్వరిది అన్నది స్పష్టంగా చెబితే బాగుంటుంది.”

ఈ వివాదం తీరేదెప్పడో తెలియదు కానీ, దీపికా పదుకొణెకి ఇది పరీక్షల సమయమే!

, , ,
You may also like
Latest Posts from