తెలుగులో భారీ అంచనాలతో, రకరకాల కుటుంబ వివాదాలతో మోసుకు వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో ఓ వినూత్న ప్రయోగం చోటు చేసుకుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి స్టార్ కాస్ట్ అందరి డబ్బింగ్‌ను AI సాంకేతికత ద్వారా రూపొందించారు. ఆయా భాషలలో నటీనటుల స్వరానుసారంగా కృత్రిమ మేథ అందంగా ఈ పని చేయనుంది. అయితే తెలుగు వెర్షన్‌లో మాత్రం ఒరిజనల్ వాయిస్‌లనే వినిపించనున్నారు.
ఈ సినిమాను దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్న టీమ్ రేపటి నుంచి విస్తృత ప్రమోషన్స్ ప్రారంభించనుంది. అందులో భాగంగా దుబాయ్‌లో కూడా ఒక స్పెషల్ ప్రమోషనల్ క్యాంప్ ఉండనుంది.
ఇక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 22న భీమవరంలో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్, విజువల్స్, భారీ బడ్జెట్, వీఎఫ్ఎక్స్—ఇలా అన్ని విషయాలపై కన్నప్పపై భారీ అంచనాలు నెలకొల్పాయి. మంచు విష్ణు తన గత పరాజయాలను మరిచి ఒక ఘన విజయం అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.
AI, మైథాలజీ, విజువల్స్ మిక్స్ అయిన ఈ సినిమా విజయం సాధిస్తుందేమో చూడాలి!