ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో క్రేజ్‌కు మారుపేరు అనుష్క శెట్టి. స్టార్‌హీరోలందరితో యాక్ట్ చేసిన ఘనత, భారీ బడ్జెట్ చిత్రాల బాక్సాఫీస్ సక్సెస్, ఆడిషన్స్ లేకుండానే డైరెక్టర్లే ఫోన్ చేసి ఆఫర్లు ఇచ్చే స్థాయి — ఇవన్నీ కలిపితే ఒక స్టార్‌హీరో కంటే తక్కువేమీ కాదు ఆమె స్థానం.

“అరుంధతి”, “వేదం”, “భాగమతి”, “బాహుబలి” లాంటి చిత్రాల‌తో అందరికీ సూపర్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క, సొంతంగా సినిమాని హిట్ చేయగల నటి. ఒకప్పుడు అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ అనుష్కే.

అనుష్క ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ తో సత్తా చాటుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కనుమరుగు అయిన తరుణంలో అనుష్క ఆ లోటు తీర్చేశారు. అరుంథతి, రుద్రమదేవి, భాగమతి వీటిలో ఎక్కడా అసలు అనుష్క కనిపించదు, క్యారక్టర్లే కళ్ల ముందు కదలాడుతాయి. అలాగని అనుష్క వాటికే పరిమితం కాలేదు.

విక్రమార్కుడు లో రవితేజాతో చేసిన రోమాన్స్ యూత్ గుండెలను గిలిగింతలు పెట్టాయి. మిర్చీలో ప్రభాస్ అనుష్క మధ్య కెమిస్ట్రీ బాగా పండిన తీరుని ఎవరైనా మరచిపోగలరా. అనుష్క బాహుబలిలో ప్రభాస్ రానాతో పాటు మరో పిల్లర్ గా నిలిచి ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడానికి తన వంతు పాత్ర పోషించారనే చెప్పాలి. అయితే… ఇప్పుడు ఆ వెలుగు మరింత మసకబారినట్టే కనిపిస్తోంది.

ఇప్పుడు స్వీటీ ఎక్కడ?

చాలా కాలంగా వెండి తెరపై స్వీటీని (అనుష్క) చూడటం లేదు. పెద్దగా ఈవెంట్లు, ఆడియో లాంచ్‌లు, ఫంక్షన్లకు కూడా హాజరయ్యే పరిస్థితి లేదు. చివరగా ఆమె ఏ ఈవెంట్‌కి వెళ్లిందో కూడా అభిమానులు గుర్తు చేసుకోలేకపోతున్నారు.

ANUSHKA (2)

తాజాగా బాహుబలి విడుదలై దాదాపు పదేళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన గ్రాండ్ రీయూనియన్‌లోనూ అనుష్క గైరు హాజరు. రాజమౌళి, ప్రభాస్, రానా వంటి ప్రధాన తారాగణం అందరూ మెరిశారు. కానీ స్వీటీ మాత్రం కనిపించలేదు.

ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్?

అనుష్క ఇప్పుడు “ఘాటీ” అనే ఒకే ఒక్క తెలుగు సినిమాతో బిజీగా ఉందని సమాచారం. కానీ… అందులోనూ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్వీటీ పాల్గొనబోవడంలేదట. దర్శకుడు క్రిష్ మరియు టీం ప్రమోషన్లన్నీ ఆమె లేకుండానే ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

అసలు స్వీటీకి ఏమైంది?

ఇన్నాళ్లుగా స్వీటీ వ్యక్తిగత సమస్యలతో పోరాడుతోందని, అందుకే పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు మూలకారణం ‘సైజ్ జీరో’ అని చెప్పుకుంటున్నారు.

ఆ సినిమాకోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుని బొద్దుగా మారిన అనుష్క, ఆ త‌రువాత మళ్లీ సన్నబడేందుకు ఎన్నో ప్రయ‌త్నాలు చేసింది.

కానీ వాటిలో ఏదీ ఫలించకపోవడంతో ఆమెలో డిప్రెషన్ మొదలైందని టాక్. పైగా ఎక్కువ బరువుతో బహిరంగంగా కనిపించాలన్న ఆత్మవిశ్వాసం కూడా లేకపోవడమే, ఆమె ఈవెంట్లకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణమట.

సెట్‌లోనూ స్పెషల్ కండీషన్స్?

సినిమా షూటింగ్‌ల్లోనూ అనుష్క తక్కువ మంది మాత్రమే సెట్లో ఉండాలని డిమాండ్ చేస్తోందట. ఇంకా, కెమెరాకి బొద్దుగా కాకుండా కనిపించేందుకు గ్రాఫిక్ వర్క్ అవసరమవుతుండటంతో… నిర్మాతలు CG ఖర్చుపై ఎక్కువ పెడుతున్నారట.

రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ మొత్తం VFX ఫోకస్ మీద వెచ్చించాల్సి వస్తోందన్నది ఫిలింనగర్ టాక్.

ఫ్యాన్స్‌కి ఫీలింగ్

స్వీటీకి ఎదురైన ఇబ్బందులు తెలిసి అభిమానులు కూడా బాధపడుతున్నారు. అనుష్క ఎప్పటిలా ఫిట్‌గా, క్యూట్‌గా తిరిగి బహిరంగంగా కనిపించాలంటే, ఆమె ఆరోగ్యం తిరిగి పటిష్టంగా మారాలి. అప్పటివరకు ఆమె గైర్హాజరే కానీ, కోణం మారలేదని సినీ వర్గాల మాట.

anushka12

ఫైనల్‌గా…
ఒక‌ప్పుడు టాలీవుడ్‌ను శాసించిన స్వీటీ… ఇప్పుడు మళ్లీ తిరిగొస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఆమె సంకల్పమే. అభిమానులు మాత్రం ఒక్క ఫోటోకైనా ఎదురుచూస్తూనే ఉన్నారు… “ స్వీటీ తిరిగొస్తుంది” అనే నమ్మకంతో.

, , , ,
You may also like
Latest Posts from