పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీర మల్లు – పార్ట్ 1: సర్డ్ vs స్పిరిట్’ నుంచి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయి మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ బైటకు వచ్చాయి.
ట్రైలర్ తర్వాత ప్రమోషన్లు స్లోగా… ఎందుకంటే?
ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో చిత్రబృందం రిలాక్స్ అయింది. కానీ పూర్తి స్థాయి ప్రమోషన్స్‌లోకి ఎందుకు వెళ్లలేదు అన్నదానికి కారణం ఫైనాన్షియల్ క్లారిటీ లేకపోవడమే. చిత్ర నిర్మాతకు థియేట్రికల్ బిజినెస్ నుండి వచ్చే రెవెన్యూతో అప్పులు క్లియర్ చేయాల్సిన అవసరం ఉందట. అందుకే ముందు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ పూర్తయ్యే వరకు ప్రమోషన్లను పెండింగ్‌లో పెట్టారు.
ప్రస్తుతం బిజినెస్ చర్చలు జోరుగా జరుగుతున్నాయని, వారంలోపే అన్నీ సెటిల్ అవుతాయనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఆ తర్వాతే భారీ ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
విశాఖలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగే పండుగ!
ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జూలై 20న విశాఖపట్నంలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌తో పాటు, మళ్లీ పవన్ మేనియా ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధమవుతున్నారు ఫ్యాన్స్.
మొత్తానికి… జూలై 24న సినిమా విడుదల కానుండగా, జూలై 20న విశాఖలో జరిగే ఈవెంట్‌తో మాస్ ప్రమోషన్లు మొదలవనున్నాయి. పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లుగా స్క్రీన్‌పై ఎలా తళుక్కుమంటారో చూడాలంటే ఇంకొద్దికాలమే!