నిధి అగర్వాల్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకోవాలని చాలా కృషి చేసింది. అయితే, “హరి హర వీర మల్లు” అనే మెగా ప్రాజెక్ట్‌కి ఆమె చేసిన ఎగ్రిమెంట్ , ఆమె కెరీర్‌కు ఒక పెద్ద వెనకడుగు అయ్యింది అనచ్చు.

మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్.. ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని దీంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది నిధి. తెలుగు తమిళ భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్న ఇస్మార్ట్ బ్యూటీ.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో హీరోయిన్ గా కనపడింది.

పవన్ కళ్యాణ్ & ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కచ్చితంగా ఓ వంతు గ్లామర్, మార్కెట్‌వాల్యూ ఇస్తుంది. కానీ ఈ చిత్రాలు చాలా పతిష్ఠతో కూడి, రాజకీయాలు, డేట్ షఫిల్స్ వల్ల ప్రాసెస్ స్లోగా ఉంటుంది.

ఈ కారణంగా, నిధి వరుస సినిమాలతో కన్పించలేకపోయింది. ఇండస్ట్రీలో “out of sight, out of mind” అనే మాట అక్షరాలా ఆమెపై వర్తించిపోయింది.

హరి హర వీరమల్లు సినిమాకి సైన్ చేసిన సమయంలోనే నిధి ఒక బాండు మీద సంతకం చేసింది. దాని ప్రకారం ఆ చిత్రం షూటింగ్ పూర్తయ్యే వరకు ఆమె మరో ప్రాజెక్ట్ చేయకూడదని రూల్. ఇది ఒక హీరోయిన్‌ను పూర్తిగా ఒక సినిమాకే కట్టిపడేసే విధంగా ఉండగా, వాస్తవంగా ఆమె నాలుగేళ్ల కాలాన్ని ఈ ఒక్క సినిమాకే అంకితం చేశారు.

అయితే, ఈ లోపులో “హరి హర వీర మల్లు” అనేక కారణాల వల్ల నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్, నిర్మాత ఆర్ధిక ఇబ్బందులు, దర్శకుడు కృష్ణ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం… ఇలా ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూ, షూట్ నిలిచిపోయింది.

ఇవన్నీ చూసిన నిధి అగర్వాల్ నిర్మాతను కలిసి మరొక సినిమా చేయడానికి అనుమతి కోరింది. నిర్మాత కేవలం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే సైన్ చేయమని క్లియర్‌గా చెప్పారు. అప్పుడు ఆమె ప్రభాస్ హీరోగా చేస్తున్న “ద రాజా సాబ్” అనే భారీ చిత్రాన్ని ఎంపిక చేసుకుంది.

2024లో “హరి హర వీర మల్లు” షూటింగ్ తిరిగి ప్రారంభమైనప్పుడు, నిధి రెండు సినిమాల మధ్య షెడ్యూల్ మేనేజ్‌మెంట్‌లో తన ప్రొఫెషనలిజాన్ని చూపించింది. ఆమె విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరుగుతూ రెండు పెద్ద సినిమాలకు కాల్‌షీట్లు ఇచ్చింది.

కానీ, అంతటి త్యాగం చేసిన “హరి హర వీర మల్లు” రిలీజ్ అయ్యాక ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమాకు వచ్చిన రివ్యూలు, బాక్సాఫీస్ కలెక్షన్లు నిరాశపరిచాయి.

నిధి కెరీర్ మళ్లీ ఊపందుకోవాలన్న ఆశలు కొంతవరకు వెనక్కి తగ్గిపోయాయి. ఇప్పుడు ఆమె ఆశలు “ద రాజా సాబ్” మీదే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒకవేళ ఇది హిట్ అయితే, నిధికి తిరిగి భారీ అవకాశాలు లభించే అవకాశముంది. ఆమె ఇప్పటికే కొత్త స్క్రిప్ట్స్ వింటూ, దర్శక నిర్మాతలతో చర్చలు మొదలుపెట్టింది.

నిధి అగర్వాల్ నాలుగు సంవత్సరాలుగా ఒక్క సినిమాలో బంధించబడిన తీరును పరిశీలిస్తే, అది ఒక రిస్కీ నిర్ణయం. కానీ ఆమె చూపిన డెడికేషన్, ప్రొఫెషనలిజం విశేషం. ఇప్పుడు మిగిలినది—ఒక మంచి హిట్ మాత్రమే. “ద రాజా సాబ్” ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందా? చూడాల్సిందే.

నిధి నాలుగేళ్ల గ్యాప్‌కి లోనవడం వల్ల తోటి యంగ్ హీరోయిన్స్ నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అనుపమ పరమేశ్వరన్, మృణాల్ ఠాకూర్, సాయి పల్లవి వంటి వాళ్లు వరుసగా స్క్రీన్‌పై కనిపిస్తూ ప్రేక్షక మైండ్‌షేర్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిధికి తను తిరిగి “visible” అవ్వాలంటే ఒక గట్టిగా వర్క్ చేయాల్సిందే.

ఇప్పటికే అనేక దర్శకదర్శకులనూ, పెద్ద ప్రొడ్యూసర్లా నిధిని తమ సినిమాల్లోకి తీసుకోవాలనే ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. కరోనా తరవాతే కాదు, ఈసారి బంగారు బాట వేసుకున్నట్లు…నిధి అగర్వాల్ — రీఎంట్రీలాంటి కెరీర్ ఓ గొప్ప సక్సెస్ కోసం సిద్దంగా ఉంది!