క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం కు కమల్ హాసన్ తో తీసిన ‘థగ్ లైఫ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలసిందే. 4917 స్క్రీన్లలో విడుదలైన ఈ భారీ బడ్జెట్ చిత్రం (రూ.200 కోట్లు) థియేట్రికల్‌గా సగం కూడా వసూలు చేయలేకపోయి, దాదాపు రూ.150 కోట్ల నష్టాలను కలిగించింది. కమల్ నటన, టెక్నికల్ ప్రమాణాలు మంచి గుర్తింపు పొందినా, కథలో బలం లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఆ సినిమాని తిరస్కరించారు. స్వయంగా మణిరత్నం స్పందిస్తూ – “ప్రేక్షకుల అంచనాలకు అందని సినిమా ఇచ్చాం. బాధ కలిగింది… క్షమించండి” అని కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు… మణిరత్నం తిరిగి ఒక కొత్త ఫేజ్ ప్రారంభిస్తున్నాడు!

తాజాగా వచ్చిన వార్తల ప్రకారం, మణిరత్నం తన తదుపరి సినిమా కోసం విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ను ఎంచుకున్నారు. కొద్దివారాల క్రితమే వీరిద్దరి మధ్య లుక్ టెస్ట్ జరిగినట్లు సమాచారం. స్క్రిప్ట్ చదివిన తర్వాత ధృవ్ కి అది బాగా నచ్చింది. ముఖ్యంగా ఇది మణిరత్నం మార్క్ రొమాన్స్-యాక్షన్ మిక్స్ సినిమా కావడం విశేషం.

ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ ఎంపికయ్యారు. సంగీత దర్శకత్వ బాధ్యతలు ఎప్పటిలాగే ఏఆర్ రెహ్మాన్ నిర్వహించనున్నారు. మిగిలిన టెక్నికల్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. షూటింగ్ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రారంభమవుతుంది.

ధృవ్ ప్రస్తుతం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “బైసన్” (దర్శకుడు: మారి సెల్వరాజ్) లో నటిస్తున్నాడు, అది అక్టోబర్ 17, దీపావళి కానుకగా విడుదల కానుంది.

విక్రమ్ – మణిరత్నం నుంచి ధృవ్ – మణిరత్నం దాకా…

ధృవ్ తండ్రి విక్రమ్ కూడా మణిరత్నంతో ‘రావణన్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేశారు. ‘అదిత్య కరికాలన్’ పాత్రలో ఆయనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తండ్రి స్థాయికి తగ్గ స్థాయిలో ధృవ్ కి అవకాశం రావడం, మణిరత్నం భవిష్యత్తు ప్రాజెక్ట్‌తో ఆయన రీ-ఎంట్రీ చేయడం ఆసక్తికర పరిణామమే.

ఇది రీబూట్ కాదు – రిక్లైమ్!

“థగ్ లైఫ్”తో వెనక్కి వెళ్లిన మణిరత్నం ఇప్పుడు కొత్త తరం హీరోతో రిస్క్ తీస్తూ మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ప్రేమ, భావోద్వేగం, థ్రిల్ అన్నీ మిళితమైన ఈ సినిమా మరొకసారి మణిరత్నం మార్క్‌ను ముద్రించగలదా? అనే ప్రశ్నకి సమాధానం మాత్రం నవంబర్ షెడ్యూల్ మొదలైన తర్వాతే తెలుస్తుంది.

, , , , ,
You may also like
Latest Posts from