ఆగస్టు 9 – ఇది మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి పండగే! ఈసారి 50వ బర్త్‌డే… జంబో సెలబ్రేషన్స్‌కి అంతా సిద్ధమవుతుంటే, ఒకటే ఊహ – #SSMB29 నుంచి ఏదైనా బాంబ్ పడతుందని! ఫస్ట్‌లుక్ అయినా, వీడియో గ్లింప్స్ అయినా వస్తుందనుకుని ఫ్యాన్స్ మాడిపోయేలా ఎదురుచూస్తున్నారు.
కానీ రియాలిటీ? ఓవర్ ద టాప్ షాక్!
సెట్ లో బిజీగా ఉన్నా, ఇప్పటివరకు షూట్ పూర్తయిన ఎపిసోడ్లు, పాటలు ఉన్నా – రాజమౌళి టీం నుంచి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా రానందట. పోస్టర్? గ్లింప్స్? సింపుల్‌గా చెప్పాలంటే – “ఏదీ లేదు!”
ఇది ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచే విషయమే.
వై? ఎందుకు?
ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు – రాజమౌళి ఇప్పుడే హైప్ మేజిక్ మొదలుపెట్టే ప్లాన్‌లో లేడట. సినిమా 2028 విడుదల కానుందని, ఇంకా మైలు రాళ్లు చాలా ఉన్నాయని చెప్పుకుంటూ, ప్రస్తుతానికి ప్రమోషన్ గేమ్ మొదలవడం లేదట.
అయితే ఇక్కడే సోషల్ మీడియాలో వివాదం మొదలవుతుంది.
రాజమౌళికి మహేశ్ బాబు బర్త్‌డే స్పెషల్నెస్ పట్టదా?
ఈ మౌనం ఫ్యాన్స్ మీద దారుణంగా చూపిన నిర్లక్ష్యమా?
లెజెండరీ డైరెక్టర్ – సూపర్‌స్టార్ కాంబోలో సైలెన్స్ ఎందుకు?
ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని ఫ్యాన్ గ్రూపులు #WakeUpSSMB29 హ్యాష్‌ట్యాగ్‌తో రచ్చ చేస్తున్నాయి. “ఇదేనా గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ట్రీట్?” అని మండిపడుతున్నారు.
ఏదైమైనా ఈసారి మహేశ్ బాబు బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ, ఫ్యాన్స్ స్థాయిలోనే ముగిసిపోవచ్చు. #SSMB29 వింత మౌనమే ఫ్యాన్స్‌కి బర్త్‌డే గిఫ్ట్!