తమిళ లెజెండ్ రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా “కూలీ” ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంతేకాదు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ హిట్ మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇది సూపర్‌స్టార్‌తో ఆయన తొలి చిత్రం.
చెన్నైలో ఇటీవల కూలీ ప్రీ-రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమంలో రజినీ, తన ప్రత్యేక శైలిలో, లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఈ సినిమా ఎలా ఓకే అయ్యిందో వివరించారు. ఇందులో ఒక ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే, కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు ముందే లోకేష్‌తో సినిమా ప్రాజెక్ట్ ఆలోచననలో ఉన్నట్టే ఉందని రజినీ చెప్పారు.
రజనీ ఇలా చెప్పారు: లోకేష్ డెబ్యూ చిత్రం మానగరం మరియు ఖైదీ సినిమాలు అద్భుతమన్నారు. “నేను ఖైదీ సినిమా చూసిన వెంటనే లోకేష్‌ను కాల్ చేసి, ఇంకెవరితో ముందుకు వెళ్లక ముందే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను ,” అన్నారు సూపర్‌స్టార్.
అలాగే … “లోకేష్‌కి నేను ‘నీ దగ్గర నా కోసం కథ ఉందా?’ అని అడిగాను. అతను అన్నాడు, ‘సార్, ఒక కథ ఉంది. త్వరలో చెబుతాను. కానీ ఒక విషయం, నేను కమల్ ఫ్యాన్, సర్.అదీ నా అదృష్టం. నెల్సన్ కూడా మా ఇంటికి వచ్చి బాగా కాఫీ తాగాడు, మొదటగా చెప్పే మాట ఇదే – నేను కమల్ ఫ్యాన్. నేను ఎవరి ఫ్యాన్ నువ్వు అని అడిగానా? వారు అనుకోకుండా నన్ను మాస్ హీరోగా కాకుండా కమల్ లాగా తెలివిగా నటించమని సూచిస్తున్నారు,’ అని చెప్పగా మొత్తం హాల్ ఆనందంలో మునిగిపోయింది.
తలైవర్ కంటిన్యూ చేస్తూ… “లోకేష్ నాకు అద్భుతమైన ఫస్టాఫ్ వినిపించాడు. రెండవ భాగానికి కొంత సమయం కావాలని చెప్పాడు. ఆ సమయంలో కమల్ కాల్ చేసి, ‘నా వద్ద మంచి స్క్రిప్ట్ ఉంది (విక్రమ్), 40 రోజుల్లో పూర్తవుతుంది, అప్పుడు లోకేష్ నీ దగ్గరకు వస్తాడు’ అని చెప్పారు. కానీ విక్రమ్ షూటింగ్ సాగుతూ ఉండడంతో ఆలస్యమైంది,” అన్నారు రజినీ.
“విక్రమ్ విడుదలయింది కానీ లోకేష్ నుంచి సమాచారం రాలేదు. నేను మరి కొన్ని ప్రాజెక్టులపై పని మొదలుపెట్టాను. ఒక రోజు అనీ (అనిరుద్ రవిచంద్రన్) నాకు చెప్పాడు లోకేష్ కథను తీసుకొని వచ్చానని. నేను అనీకి ‘నేను లోకేష్ కోసం ఎదురుచూస్తున్నాను, కానీ అతను ఎప్పుడూ రాలేదు. వెంటనే తీసుకురా, ఈసారి వదలను’ అని అన్నాను,” అని రజినీ ఫన్నీగా చెప్పారు.
చివరగా రజినీ అన్నారు: “లోకేష్ మొదట ఒక విలన్ పాత్రను నాకు చెప్పాడు, నేను చాలా సంతోషపడ్డాను. అయితే నెల రోజుల తర్వాత లోకేష్ చెప్పాడు కథలో చాలా పాత్రలు అవసరమని (అందులో చాలామంది నటులను ‘కూలీ’లో పెట్టడం మరచిపోలేదు) చెప్పి తీసుకున్నాడు,” అంటూ రజినీకాంత్ చెప్పుకొచ్చారు.