న్యూయార్క్ వీధుల్లో హ్యాండ్-ఇన్-హ్యాండ్గా వాక్ చేస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న క్యూట్ మూమెంట్ ఇప్పుడు నెట్‌లో ఫుల్ హీట్ టాపిక్. ఆదివారం జరిగిన 43వ ఇండియా డే పరేడ్‌లో వీరిద్దరూ గ్రాండ్ మార్షల్స్గా ఎంట్రీ ఇచ్చి, మొత్తం అటెన్షన్ దొంగిలించారు.
సెలబ్రిటీగా వాహనంపై నిలబడి అభిమానులకు వేవ్ చేయడం, కమ్యూనిటీతో కలిసి వాక్ చేయడం – అన్నీ ఫుల్ జోష్‌లో సాగాయి. కానీ హైలైట్ మాత్రం – ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తున్న వీడియో. ఆ క్లిప్ క్షణాల్లోనే వైరల్ అయి సోషల్ మీడియాలో “Couple Goals” అని బ్రో జనరేషన్ షేర్ చేసుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే – “కింగ్‌డమ్” తర్వాత విజయ్, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న రాయలసీమ పీరియడ్ డ్రామాలో మళ్లీ రష్మికతో కలిసిపోతున్నాడు. “గీత గోవిందం”, “డియర్ కామ్రేడ్” తోనే వీరి జోడీకి క్రేజ్ పీక్‌లో ఉంది. అందుకే ఇప్పుడు ఈ కొత్త కాంబినేషన్‌పై అంచనాలు స్కై-హైగా ఉన్నాయి.