రామ్ చరణ్ కొత్తగా చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘Peddi’ మీద అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటులు జాహ్నవి కపూర్, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతుండగా, 2026 సమ్మర్‌లో రిలీజ్ చేసే ప్లాన్‌తో మేకర్స్ ముందుకు సాగుతున్నారు.
కానీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సంబంధించిన వార్త ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ తల్లి పాత్ర కోసం మలయాళ నటి స్వాసిక ను సంప్రదించారని సమాచారం. ఈ పాత్రలో గట్టి ఎమోషనల్ ఆర్క్ ఉందని తెలిసినా, ఆమె చివరికి “నో” చెప్పేసింది.
ఇటీవల వరుసగా అమ్మ పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న స్వాసిక, ఈసారి మాత్రం వెనక్కి తగ్గింది. కారణం? టాప్ హీరో పక్కన తల్లి పాత్రలో కనిపించడం తన కెరీర్ ఇమేజ్‌కి సరిపడదని ఆమె భావించిందట. ఇంకా తనను యంగ్ లీడ్ రోల్స్‌కి సెట్ చేయొచ్చని నమ్మకంతో ఆఫర్‌ను సూటిగా తిరస్కరించిందని టాక్.
తనను ఇంత తొందరగా వయసు మించిన పాత్రల్లో చూపించడం తన భవిష్యత్తుకి నష్టం చేస్తుందేమోనని ఆమెకు అనుమానం వచ్చిందట. అందుకే బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చినా, రామ్ చరణ్ తల్లి పాత్ర మాత్రం చేయకూడదని నిర్ణయానికి వచ్చిందని తెలిసింది.
ప్రస్తుతం స్వాసిక ‘Lubber Pandu’, ‘Maaman’ వంటి హిట్స్ తో బిజీగా ఉంది. ‘Retro’, ‘Thammudu’ లోనూ నటించింది. త్వరలో సూర్య నటిస్తున్న ‘Karuppu’ సినిమాలో కనిపించనుంది. కెరీర్ పీక్‌లో ఉన్న ఈ దశలో పెద్ద హీరో పక్కన మదర్ రోల్ చేయడమేంటి అన్న ప్రశ్నే ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ.