

ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు, బిజినెస్‌మెన్, రాజకీయ నాయకుల పేర్లు, ఫోన్ నంబర్లను వాడి మోసాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలోనో, వాట్సాప్‌లోనో నకిలీ రిక్వెస్టులు వస్తున్న కేసులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు అదే పరిస్థితి కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎదురైంది. ఆయన, భార్య ప్రియాంక ఫోన్లు హ్యాక్ అయి, వారి పేరుతో మనీ రిక్వెస్టులు పంపుతున్నట్లు బయటపెట్టారు.
ఈ విషయాన్ని కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర షాకింగ్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేసారు. తనది మాత్రమే కాకుండా భార్య ప్రియాంక ఫోన్లను కూడా హ్యాక్ చేశారని బయటపెట్టారు. ఆ హ్యాకర్ వారి నంబర్ల నుండి మోసపూరిత డబ్బుల డిమాండ్లు చేస్తున్నాడని ఆయన హెచ్చరించారు.
Beware… pic.twitter.com/ftbQDFodTf
— Upendra (@nimmaupendra) September 15, 2025
“మా నంబర్ల నుండి వస్తున్న మనీ రిక్వెస్టులు, కాల్స్, మెసేజెస్ అన్నీ ఫేక్ … దయచేసి స్పందించవద్దు” అని అభిమానులు, స్నేహితులకు వీడియో మెసేజ్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
“ Beware” అంటూ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసిన ఉపేంద్ర, హ్యాకర్ చేస్తున్న మోసానికి ఎవరూ బలి కాకూడదని కోరారు. ఇదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు కూడా నమోదు చేసినట్లు ధృవీకరించారు.
ఇక తాజాగా ఉపేంద్ర, సూపర్‌స్టార్ **రజనీకాంత్ “కూలీ”లో ప్రత్యేక పాత్రతో మెరిశారు.