
సౌత్‌లో గత కొన్ని ఏళ్లుగా రీ-రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా సాగింది. బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రావడంతో భారీ రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ అదే ఫార్ములాను పదే పదే చూసి ప్రేక్షకులు విసుగెత్తిపోయినట్టున్నారు. తాజాగా విజయ్ ‘ఖుషీ’ రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది.
గతంలో విజయ్ ‘గిల్లీ’ (తెలుగులో ‘ఒక్కడు’ రీమేక్) రీ-రిలీజ్ అయినప్పుడు మాత్రం హిస్టారిక్ రన్ నమోదు చేసింది. తమిళనాడులోనే 4.3 కోట్ల గ్రాస్‌తో ఓపెన్ అయి, చివరికి వరల్డ్‌వైడ్‌గా 30 కోట్లకు పైగా వసూలు చేసింది.
నిర్మాత ఏఎం రత్నానికి షాక్!
ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాత ఏఎం రత్నం ఈ రీ-రిలీజ్‌తో ఊపిరి పీలుస్తానని ఆశ పెట్టుకున్నారు. కానీ ఫలితం షాక్ ఇచ్చింది.
తమిళనాడులో ‘ఖుషీ’ మొదటి రోజు కలెక్షన్ కేవలం 1 కోటి దగ్గరే ఆగిపోయింది. వీకెండ్ బుకింగ్స్ కూడా బలహీనంగానే ఉన్నాయి. ‘గిల్లీ’ డే వన్ రికార్డుకే సగం దగ్గర ఆగిపోయిన ఈ సినిమా, ఫుల్ రన్‌లో కూడా దానిని దాటే అవకాశాలు లేవని ట్రేడ్ టాక్.
“విజయ్ ఖుషీ రీ-రిలీజ్ ఎందుకు ఫెయిల్ అయింది? ప్రేక్షకుల ఆసక్తి తగ్గిందా… లేక కంటెంట్ వర్కౌట్ కాలేదా?” అన్నది ఇప్పుడు ఫ్యాన్స్ డిబేట్ పాయింట్‌గా మారింది.
