భారతదేశంలో కలెక్షన్స్ పరంగా గర్జిస్తున్న ‘కాంతారా ఛాప్టర్ 1’, ఓవర్సీస్‌లో మాత్రం నిరాశ కలిగించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ స్పిరిచువల్ డ్రామా దేశీయ బాక్సాఫీస్‌లో సుమారు ₹265 కోట్లు వసూలు చేసినా, విదేశీ మార్కెట్‌లో మాత్రం ఆ స్థాయి జోరు కనిపించలేదు.

విశేషమేమిటంటే — ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ను మేకర్స్ స్వయంగా చేయలేదు. భారీ మొత్తంలో కొనుగోలు చేసిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు, కానీ కలెక్షన్లు మాత్రం అంచనాలకు దూరంగా ఉన్నాయి.

ఓవర్సీస్ బాక్సాఫీస్ కలెక్షన్లు: నిరాశాజనక వీకెండ్!

‘కాంతారా ఛాప్టర్ 1’ ప్రీక్వెల్ మొదటి వీకెండ్‌లో కేవలం $6.2 మిలియన్ మాత్రమే వసూలు చేసింది. అయితే, ఈ చిత్రానికి బ్రేక్‌ఈవెన్ పాయింట్ $15 మిలియన్, అంటే ఇంకా 60% వసూళ్లు దూరంలో ఉన్నాయి! సాధారణంగా ఓవర్సీస్ మార్కెట్‌లో మొదటి వీకెండ్‌లోనే కనీసం 75% రికవరీ రావాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఈసారి అది జరగలేదు.

పోలికతో చెప్పాలంటే — యష్, ప్రశాంత్ నీల్‌ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ ఓవర్సీస్‌లో $27 మిలియన్ వసూలు చేసింది. ఆ జోరు ‘కాంతారా’కి దక్కలేదు.

ఇప్పటికైనా పాజిటివ్ మౌత్‌టాక్‌తో కలెక్షన్లు పుంజుకుంటే తప్ప, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పవు.

రాబోయే వారం కీలకం — ‘కాంతారా ఛాప్టర్ 1’కి ఫేట్ నిర్ణయించేది ఇదే!

, , , ,
You may also like
Latest Posts from