మైక్రోసాఫ్ట్ స్థాపించి కంప్యూటర్ ప్రపంచాన్నే మార్చేసిన బిల్ గేట్స్ ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించారు. అది కూడా హిందీ టెలివిజన్ సీరియల్‌లో!

అవును, స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతున్న “క్యూకి సాస్ భీ కభీ బహు థీ 2” (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2) లో బిల్ గేట్స్ ఒక ప్రత్యేక సీన్‌లో కనిపించారు. తులసి విరాణీ (స్మృతి ఇరానీ)తో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న ఈ సీన్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

“నమస్తే టుల్సీ జీ, జై శ్రీకృష్ణా”

ప్రోమోలో బిల్ గేట్స్‌ తులసిని “నమస్తే టుల్సీ జీ, జై శ్రీకృష్ణా” అంటూ పలకరిస్తారు. అందుకు తులసి కూడా తన క్లాసిక్‌ స్టైల్లో “జై శ్రీకృష్ణా” అని సమాధానమిస్తుంది. ఇద్దరి మధ్య ఈ చిన్న సంభాషణే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

రెండు ప్రపంచాలు – ఒకే సందేశం

ఈ ఎపిసోడ్‌లో తులసి, బిల్ గేట్స్ ఇద్దరూ తల్లులు, పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడతారు. సీరియల్ కథలో ఇది చిన్న సీన్ అయినా, దాని వెనుక ఉన్న మెసేజ్ మాత్రం పెద్దది. “ప్రతి తల్లి, ప్రతి బిడ్డ సురక్షితంగా ఉండాలి” అనే ఆలోచనతో బిల్ గేట్స్ ఈ స్పెషల్ అపీరియన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తులసిగా మళ్లీ స్మృతి ఇరానీ

ఈ సీరియల్‌లో తులసి పాత్రను పోషించిన స్మృతి ఇరానీ ఒకప్పుడు హిందీ టీవీలో అత్యంత పాపులర్ నటి. తర్వాత ఆమె రాజకీయాల్లోకి వెళ్లి బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, మళ్లీ తన పాత పాత్రలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆమెతో జూమ్ కాల్‌లో మాట్లాడిన బిల్ గేట్స్ సీన్‌ — ఫ్యాన్స్‌కి డబుల్ సర్‌ప్రైజ్‌గా మారింది.

టెలివిజన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్

బిల్ గేట్స్ ఒక భారతీయ టీవీ సీరియల్‌లో నటించడం ఇదే మొదటిసారి. ప్రోమో బయటికి రాగానే సోషల్ మీడియా అంతా “బిల్ గేట్స్ ఇన్ క్యూకి?” అంటూ ట్రెండింగ్‌ మొదలైంది. “మైక్రోసాఫ్ట్ బాస్ నుంచి జై శ్రీకృష్ణా వినటం ఇదే ఫస్ట్ టైమ్!” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from