
“వేషం ఇచ్చి… ఫేవర్స్ అడిగారు!” – కాస్టింగ్ కౌచ్ పై మదల్సా శర్మ షాకింగ్ రివిలేషన్
హిందీ టెలివిజన్‌లో ఫ్యామిలియర్ ఫేస్, బాలీవుడ్లో పాపులర్ యాక్ట్రెస్ అయిన మదల్సా శర్మకి అసలు ఆరంభం అయితే మన టాలీవుడ్లోనే. 2009లో ఫిట్టింగ్ మాస్టర్ తో ఎంట్రీ ఇచ్చి, మెం వయసుకు వచ్ఛం, ఆలస్యమ్ అమృతమ్, చిత్రం చెప్పిన కథ లాంటి సినిమాల్లో కనిపించింది.
కానీ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మదల్సా షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ కెరీర్ స్టార్ట్ దశలోనే తాను కాస్టింగ్ కౌచ్ అనుభవించానని చెప్పింది. కొన్ని అసహ్యమైన పరిస్థితులు ఎదురయ్యాయని, అవి హ్యాండిల్ చేయలేకనే ఆ దారి వదిలేసుకున్నానని చెప్పింది. వేషం ఇచ్చినట్లే ఇచ్చి ఫేవర్స్ అడిగారని అంది. అయితే ఎవరు అలా అడిగారనే విషయాలు మాత్రం రివీల్ చేయలేదు.
ఆ టైంలో జరిగిన ఈ ఇబ్బందులే సౌత్ సినిమాలకు దూరం కావడానికి కారణమని ఆమె చెప్పింది. కానీ ఆసక్తికరంగా చూస్తే, ఆ సందర్భాల తర్వాత కూడా మదల్సా ఇంకా కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది.
అలాగే తన భర్త, మిథున్ చక్రవర్తి–యోగీతా బాలి కుమారుడు మిమోహ్ చక్రవర్తితో పెళ్లి, ఆయన ఇటీవల చేసిన తెలుగు సినిమా గురించీ చెప్పింది.
టాలీవుడ్ స్టార్టింగ్ డేస్‌లో ఎలాంటి షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయి? ఎవరు చేశారు? ఏం జరిగింది? మదల్సా చెప్పిన ఆ ‘అన్ప్లెసెంట్ సిచ్యుఏషన్స్’ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్‌గా మారాయి.
ఇంకా ఇంటర్వ్యూ క్లిప్స్ బయటకు వస్తాయా? మరిన్ని పేర్లు బయటకు వస్తాయా? టాలీవుడ్లో మళ్లీ కాస్టింగ్ కౌచ్ డిబేట్ బిగ్ లెవెల్లో స్టార్ట్ అయ్యేలా ఉంది!
