
“హీరోలు నష్టాలు వస్తే పారిపోవటం ఇక కుదరదు!” – నిర్మాతల మండలి యుద్ధం!
తమిళ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మండలి స్టార్ హీరోలకు మేము పూర్తిగా అప్పులు పాలై, రోడ్డుమీద పడలేము..కలిపి సినిమాలు చేద్దాం, లాభ,నష్టాలు కలిసి పంచుకుందాం అని చెప్పే స్థితికి వచ్చారు. వరస ఫ్లాప్‌లు, OTT డీల్స్ పడిపోవడం, థియేటర్ బిజినెస్ డౌన్ అవ్వడం — ఇలా అన్ని వైపులా ప్రెషర్ పెరగడంతో ఇప్పుడు నిర్మాతల మండలి గట్టిగాఅడుగు వేసింది.
ఇకపై పెద్ద సినిమాలు తీస్తే, హీరోలూ — టాప్ టెక్నీషియన్లూ కూడా లాభం–నష్టాలు పంచుకోవాల్సిందే అని ప్రకటించింది.అంటే సినిమా హిట్ అయితే వాటా… ఫ్లాప్ అయితే బాధ — ఇక లాస్ మొత్తం నిర్మాతే మోయాల్సిన రోజులు పోయాయంటూ TFPC (Tamil Film Producers Council) సూటిగా చెప్పేసింది!
“సినిమా హిట్ అయితే స్టార్‌లు కాలరు ఎగరేస్తారు, ఫ్లాప్ అయితే మాయం!” — నిర్మాతల ఆవేదన
నిర్మాతలు ఇలా అంటున్నారు – “ఇక మేము హీరోల రేమ్యూనరేషన్ భారం మోయలేము. సినిమా లాస్ అయినా వాళ్లు ఫుల్ పేమెంట్ తీసుకుంటారు. ఇది ఎక్కడి న్యాయం?”
ఇదే వాస్తవం. ప్రతి పెద్ద సినిమా ఫెయిల్ అవుతున్న కొద్దీ నిర్మాతలు దెబ్బతింటున్నారు. కొంతమంది దివాళా తీయగా, మరికొందరు ప్రాజెక్టులు ఆగిపోయే స్థితి. దీని వల్లే TFPC “ప్రాఫిట్ షేరింగ్ మోడల్”ని తీసుకువచ్చింది.
కొత్త రూల్స్ – OTT రిలీజ్ కూ గట్టి షరతులు!
TFPC ప్రకారం — ఇకపై సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎనిమిది వారాలు గడిచాకే OTTలో రిలీజ్ కావాలి. “థియేటర్ బిజినెస్ రక్షించాలంటే ఇది తప్పనిసరి” అని మండలి చెబుతోంది.
అలాగే చిన్న, మధ్యస్థాయి సినిమాలకు సరైన రిలీజ్ దొరకాలనే ఉద్దేశంతో ఫిల్మ్ రిలీజ్ రెగ్యులేషన్ కమిటీను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం సుమారు 250 సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ కమిటీ చిన్న సినిమాలకు ప్రాణం పోస్తుందనే ఆశ ఉంది.
యూట్యూబ్ ఛానెల్స్ పై కూడా కత్తి!
TFPC, సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ కలిసి —కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మీద తప్పుడు ప్రచారం, పర్సనల్ అటాక్స్, ఇండస్ట్రీ ఇమేజ్ దెబ్బతీసే కామెంట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.
హీరోల రియాక్షన్ కోసం ఎదురుచూపులు!
ఈ కొత్త “ప్రాఫిట్ షేరింగ్ పాలసీ”కి స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో అన్నదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్. కొంతమంది నిర్మాతలు మాత్రం చెబుతున్నారు – “ఇది హెల్తీ సిస్టమ్. సినిమా హిట్ అయితే అందరికీ ఆనందం, ఫ్లాప్ అయితే బాధనూ పంచుకోవాలి.”
