సినిమా వార్తలు

రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్ OTTలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

రష్మిక మందన్న ఇటీవల బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్ రైడ్‌లో ఉన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇప్పుడు డిజిటల్ దిశగా అడుగులు వేస్తోంది!. సినిమా థియేటర్లలో సూపర్ రన్ కొనసాగిస్తుండగా, ఈ సినిమా డిజిటల్ హక్కులను Netflix భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

OTT రిలీజ్ ఎప్పుడు?

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో Netflixలో స్ట్రీమింగ్‌కి సిద్ధం అవుతోందట! అయితే, అధికారిక OTT రిలీజ్ డేట్‌ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. థియేటర్లలో రన్ పూర్తయ్యే వరకు Netflix ఈ రిలీజ్ డేట్‌ని సీక్రెట్‌గా ఉంచినట్టు సమాచారం.

సక్సెస్ మీట్ హైలైట్ — విజయ్ దేవరకొండ ఎంట్రీతో రష్మిక ఈవెంట్ హీట్!

ఇక సినిమా సక్సెస్‌ని సెలబ్రేట్ చేసేందుకు ఈ రోజు హైదరాబాద్ పార్క్ హయత్‌లో గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు రష్మికకు సన్నిహితుడు, నటుడు విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు!

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, రష్మిక కెరీర్‌లో మరో టర్నింగ్ పాయింట్‌గా మారిందని టాక్.

Similar Posts