సినిమా గాసిప్స్సినిమా వార్తలు

‘తలైవర్ 173’ భారీ ట్విస్ట్! – యంగ్ డైరక్టర్ పై కమల్ దృష్టి?

తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా చెప్పబడుతున్న తలైవర్ 173పై ఆసక్తికర సమాచారం బయిటకు వచ్చింది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన బ్యానర్‌పై నిర్మించనుండగా, ప్రధాన పాత్రలో రజినీకాంత్ నటించబోతున్నారు.

ఇటీవల దర్శకుడు సుందర్ సి ఈ ప్రాజెక్ట్‌కు దూరమైన తర్వాత, చిత్రానికి కొత్త దర్శకుడి ఎంపికపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కమల్ హాసన్ స్పష్టతనిస్తూ, ఇప్పటివరకు ఎవరినీ ఫైనల్ చేయలేదని తెలిపారు. అయినప్పటికీ, కొలీవుడ్ మీడియా వర్గాల ప్రకారం, ధనుష్ ఈ చిత్రానికి దర్శకుడిగా పరిగణనలో ఉన్నట్లు సమాచారం.

ధనుష్ ప్రస్తుతం నటుడిగా పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన దర్శకత్వంలో తీసిన తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’ తమిళనాడులో మంచి విజయాన్ని సాధించింది. ఈ విజయంతోనే ఆయన పేరు తలైవర్ 173కి బలంగా వినిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ధనుష్‌ దర్శకుడిగా ఎంపికైతే, రజినీకాంత్ – కమల్ హాసన్ – ధనుష్ లాంటి ముగ్గురు ప్రముఖుల కలయికతో ఈ చిత్రం మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు, సినీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

చిత్ర దర్శకుడి పేరును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar Posts