
రాజశేఖర్–రమ్యకృష్ణ జోడీ… కానీ రీమేక్ రిస్క్?
కొన్ని కాంబినేషన్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబో రాజశేఖర్, రమ్యకృష్ణ. వీళ్లు ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత కలిసి కనిపించనున్నారు.
శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ లో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే… ఆయనకు జోడీగా రమ్యకృష్ణ మళ్లీ స్క్రీన్‌పైకి రానున్నారు! ఈ కాంబినేషన్ వస్తే ఎప్పుడూ ఖచ్చితంగా ఒక హంగామా ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఉంది.
అలాగే తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘రబ్బర్ పాండు’ ని తెలుగులో రీమేక్ చేస్తూ ఈ కాంబోను తిరిగి కలిపేస్తున్నారు. ఇంకా మరో ఆసక్తికర విషయం—ఈ సినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండగా, ‘35 – చిన్న కథ కాదు’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వదేవ్ మరో ముఖ్యమైన లీడ్ రోల్ చేస్తున్నాడు.
కానీ అసలు ప్రశ్న ఏమిటంటే… కోవిడ్ తర్వాత రీమేక్ సినిమాలంటే ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి లేదు. అంతే కాకుండా లబ్బర్ పంధు యొక్క తెలుగులోనే డబ్ వెర్షన్ Jio Hotstar లో ఇప్పటికే స్ట్రీమింగ్‌లో ఉంది.
అయితే ఈ భారీ కాస్టింగ్ + ఫ్యామిలీ కాంబినేషన్ కలిసొస్తుందా?
ఈ రీమేక్ అసలు వర్కౌట్ అవుతుందా? లేక స్ట్రీమింగ్ ఫ్యాక్టర్ దెబ్బ పడుతుందా?
