సినిమా వార్తలుసోషల్ మీడియా

చిరు నుంచి శ్రీలీల వరకు… అందరినీ టార్గెట్ చేస్తున్న ట్రోల్స్‌పై ఆది ఫైర్!

టాలీవుడ్‌లో స్టార్ ఎవ్వరైనా సరే… ట్రోల్స్ మాత్రం వదలడం లేదని హైపర్ ఆది బహిరంగంగా ఫైర్ అయ్యాడు. చిరంజీవి, బాలయ్యల నుంచి విజయ్ దేవరకొండ, శ్రీలీల వరకు అందరినీ టార్గెట్ చేస్తూ కొత్త ఫ్యాషన్‌లా ట్రోలింగ్ మారిందని ఆది చెప్పాడు.

రాజమౌళిపై వచ్చిన వివాదం గురించి మాట్లాడుతూ—
“రాజమౌళి గారు హనుమంతుడిని అవమానించలేదు. అలిగారు అంతే… కానీ ట్రోల్స్ అదంతా అతిశయోక్తిగా మార్చేశారు” అన్నారు.

ఆది ఆ ఒక్కదానితో ఆగలేదు… వరుస ఉదాహరణలతో ట్రోల్స్‌ను నిలదీశాడు:

“NTR కొత్త పాత్ర కోసం బరువు తగ్గినా… వెంటనే మీమ్స్ రెడీ!”

“బాలయ్య గారు స్టేజ్ మీద మాట్లాడితే… కామెంట్స్ వరద!”

“అల్లు అర్జున్ నవ్వుకే ట్రోలింగ్? ఇది ఏ రకం?”

“యాక్సిడెంట్ తో బాదపడిన సాయి ధరమ్ తేజ్‌ను కూడా వదలలేదు!”

“ప్రభాస్‌ లుక్‌పై ఎగతాళి… ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు!”

రామ్ చరణ్ చేసిన ‘చికిరి చికిరి’ గ్లోబల్‌గా వైరల్ అయినా కూడా…
“ట్రోల్స్ కాస్తా తగ్గలేదు… వాళ్లకు ఎప్పుడూ ఏదో ఒక ఫిక్స్‌డ్ టార్గెట్‌ ఉండాల్సిందే” అని ఆది వ్యాఖ్యానించాడు.

విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ—
“అర్జున్ రెడ్డి ఐకానిక్ సినిమా… అయ్యినా విజయ్‌ను ఏ మాత్రం ఊరుకోడం లేదు. కాస్త టైమ్ ఇచ్చినా బాగుండేది” అన్నాడు.

శ్రీలీల విషయంలో ఇంకా స్ట్రాంగ్‌గా మాట్లాడాడు:

“మన తెలుగు అమ్మాయి… హిందీ, తమిళాల్లో కూడా పాపులర్ అవుతోంది. అయినా ఆమె నటనపై ఇలా దారుణంగా ట్రోల్ చేయడం సరైంది కాదు” అని చెప్పాడు.

Similar Posts