సినిమా వార్తలు

‘ఇదే నా చివరి రోజు’… తులసి భావోద్వేగ పోస్టు – ఇండస్ట్రీలో కలకలం!

తెలుగు సినిమాల్లో తల్లి పాత్ర అంటే గుర్తొచ్చే తొలి పేరు — తులసి. దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ ప్రముఖ నటి, ఇప్పుడు తన సినీ ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలకబోతున్నట్టు ప్రకటించి ఇండస్ట్రీని షాక్‌కి గురి చేశారు.

డిసెంబర్ 31… సాయిబాబా దర్శనం చేసిన వెంటనే – అదే రోజు నుంచి సినిమాలకు పూర్తి గుడ్‌బై అని తులసి సోషల్ మీడియాలో వెల్లడించడంతో సినీ వర్గాలు, అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

పసిపాపగా కెమెరా ముందు…

1964లో — మూడున్నర నెలల పసిబిడ్డగా — ‘జీవన తరంగాలు’ సినిమాలో తొలి అడుగు. అలాటి నటి సావిత్రికి తులసి తల్లి స్నేహితురాలు కావడంతో, ఉయ్యాలలో ఊగే పసిపాప పాత్ర ఆమెకే దక్కింది.

ఆ తర్వాత నాలుగు ఏళ్ల వయసు నుంచే బాలనటిగా తెలుగు, తమిళం, కన్నడ, భోజ్‌పురి భాషల్లో 300కి పైగా చిత్రాలు… ‘శంకరాభరణం’ లోని ఆమె నటన ఇప్పటికీ గుర్తుండిపోయేదే.

హీరోయిన్‌గా వెలుగులు… తర్వాత మళ్లీ రీఎంట్రీ

బాలనటి నుంచి హీరోయిన్ గా మారి చంద్రమోహన్ లాంటి హీరోలతో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తులసి, వివిధ భాషల్లో హీరోయిన్‌గా, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తిరుగులేని స్థానం సంపాదించారు.

వివాహం అనంతరం చిన్న విరామం…
తర్వాత రీఎంట్రీ ఇచ్చి ప్రభాస్, శృతిహాసన్ వంటి స్టార్‌లకు తల్లిగా నటించి మరోమారు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తాజా నిర్ణయం – ఇండస్ట్రీకి సడెన్ జోల్ట్

ఇటీవలి కాలంలో తులసి సినిమాలు తగ్గించుకున్నారు. అదే సమయంలో ఆమె సాయిబాబాపై భక్తిని సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తూ వచ్చారు.

ఇప్పుడు మాత్రం —

“డిసెంబర్ 31 నా చివరి షూటింగ్‌ డే… ఆ తరువాత కెమెరాకు గుడ్‌బై” అని స్పష్టంగా తెలిపి, తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు పలకనున్నట్లు సూచించారు.

ఏం జరుగుతోంది? ఎందుకు ఈ నిర్ణయం?

తులసి నిర్ణయం వెనుక కారణాలపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇంతకాలం ఇండస్ట్రీకి సేవ చేసిన నటి ఇలా ఒక్కసారిగా సినిమాలకు గుడ్‌బై అంటే? అభిమానులు కూడా ఇదే ప్రశ్నతో ఉన్నారు.

Similar Posts