తమిళ నటుడు విశాల్ ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాడు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమస్యల నుండి, ఆర్థిక వివాదాలు, పబ్లిక్ స్టేట్‌మెంట్స్ వరకు — ఎక్కడో ఒక వివాదం మధ్యలోనే కనిపిస్తున్నాడు విశాల్. ఇప్పుడు తాజా ఎపిసోడ్ — లైకా ప్రొడక్షన్స్ రుణ కేసు… ఇందులో హైకోర్టు వేసిన ఒక ప్రశ్న మాత్రం మొత్తం ఇండస్ట్రీని షాక్‌లోకి నెట్టింది!
“విశాల్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటిస్తే సరిపోతుందా?” — కోర్టు నేరుగా ప్రశ్న!
వివరాల్లోకి వెళ్తే :
విశాల్ తన Vishal Film Factory కోసం ఫైనాన్షియర్ అన్బుచెళియన్ నుండి ₹21.29 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఆ అప్పును లైకా ప్రొడక్షన్స్ క్లియర్ చేసింది. దానికి బదులుగా — విశాల్ సినిమాల హక్కులు తమవిగా పెట్టుకునేలా ఒప్పందం జరిగింది.
కానీ విశాల్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సినిమాలు రిలీజ్ చేశారని లైకా కోర్టును ఆశ్రయించింది. సింగిల్ జడ్జి 30% వడ్డీతో అసలు డబ్బు మొత్తం చెల్లించాలి అని ఆదేశించడంతో, విశాల్ అప్పీల్ చేశాడు.
“30% వడ్డీ అంటే దోపిడీ!” — విశాల్ తరఫు వాదన
జస్టిస్ ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం, జస్టిస్ ముహమ్మద్ షఫీక్ బెంచ్ ముందు విచారణలో విశాల్ న్యాయవాది వాదిస్తూ— “30 శాతం వడ్డీ చట్టవిరుద్ధం. దాంతో వడ్డీ మాత్రమే ₹40 కోట్లు అవుతోంది. లైకా చెప్పినంత ధనవంతుడు విశాల్ కాదు,” అని వాదించారు.
అప్పుడే కోర్టు నుంచి షాకింగ్ ప్రశ్న:
“అయితే విశాల్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించమంటారా?”
కోర్టు పాక్షిక ఊరట ఇచ్చింది — కానీ ఒక పెద్ద షరతుతో!
కోర్టు 30% వడ్డీని “దోపిడీ వడ్డీ” గా అభివర్ణిస్తూ, సింగిల్ జడ్జి ఆర్డర్‌పై మధ్యంతర స్టే విధించింది. అయితే… విశాల్ తప్పనిసరిగా ₹10 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయాలి అని స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
మరొక వివాదం… ఇండస్ట్రీలో మళ్లీ విశాల్ పేరు హాట్ టాపిక్!
ఇప్పటికే “Awards are nonsense” అంటూ చేసిన వ్యాఖ్యలతో హంగామా క్రియేట్ చేసిన విశాల్, ఇప్పుడు కోర్ట్‌రూమ్ డ్రామాతో మళ్లీ హెడ్లైన్స్‌లోకి వచ్చాడు.

