సినిమా వార్తలు

ఐ-బొమ్మ రవి మరోసారి కస్టడీలో! ఈసారి పోలీసులు ఏ బాంబు పేల్చబోతున్నారు?

ఐ-బొమ్మ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇమంది రవి అరెస్టుతో కేసు ముగుస్తుందని అనుకున్న చాలామందికి— ఇప్పుడు పోలీసులు తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది: “ఈ పైరసీ నెట్‌వర్క్ ఇంకా పూర్తిగా ఛేదించలేదు.”
అదే కారణంగా రవిపై విచారణ మరో దశలోకి అడుగుపెట్టింది.

పైరసీ వెబ్‌సైట్ ‘ఐ-బొమ్మ’ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవి మరోసారి కస్టడీలోకి వెళ్లాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టు అనుమతితో తదుపరి మూడు రోజులు అతడిని తీవ్రంగా విచారించనున్నారు.

మొదటి రౌండ్ కస్టడీలోనే రవి డిజిటల్ ట్రైల్, పలు కీలక టెక్నికల్ ఆధారాలు పోలీసుల చెంతకు చేరాయి. కానీ అతడి ఆర్థిక లావాదేవీలు, క్రిప్టో మూవ్‌మెంట్స్, బ్యాంక్ అకౌంట్ల నిజమైన నెట్‌వర్క్ ఇంకా పూర్తిగా అన్‌లాక్ కాలేదని అధికారులు భావించారు.

ఇదే కారణంగా పోలీసులు మరోసారి కోర్టును ఆశ్రయించి “మరిన్ని వివరాలు వెలికితీయాల్సి ఉంది” అంటూ అదనపు కస్టడీ కోరగా— న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని సైబర్‌క్రైమ్ స్టేషన్‌కు తరలించి విచారణను వేగవంతం చేశారు.

ఈసారి విచారణ ఫోకస్ ఏమిటి?

రవి నిజంగా ఎన్ని అకౌంట్లు వాడాడు? డబ్బు ఏ దేశాల నుంచి ఏ దేశాలకు వెళ్లింది? అతడి పైరసీ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించింది? ఈ ఆపరేషన్ వెనుక మరెవరి పాత్ర ఉంది? ఐ-బొమ్మ & ఇతర సైట్లకు రవితో ఉన్న అసలు కనెక్షన్ ఏమిటి? అన్న అంశాలపై ఈ కొత్త కస్టడీ విచారణ సాగనుంది.

Similar Posts