
“ఆ డేట్ కావాలి!” – అఖండ 2పై అభిమానుల ఆన్లైన్ ఉద్యమం!
బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్ ప్రేక్షకులకది వేరే రకం పండుగ. కానీ ఈసారి ‘అఖండ 2’ విడుదల చుట్టూ జరిగిన పరిణామాలు మాత్రం అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. డిసెంబర్ 5న సినిమాను చూడాలని వేలాదిగా థియేటర్లకు వెళ్ళేందుకు సిద్ధమైన వాళ్లు, ఒకరోజు కాదు… ఒక వీకెండ్ మొత్తం కోల్పోయారు. అందుకే ఇప్పుడు అభిమానుల ఒక్క మాట:
“ఆ డేట్ కావాలి… ఇంకెందుకు ఆలసం?!”
12నా? 24నా? – చర్చలు, సమావేశాలు, డిసిజన్ ఇంకా పెండింగ్!
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన మీటింగ్‌లో డిస్ట్రిబ్యూటర్లు – ప్రొడ్యూసర్లు కలిసి చర్చించారు.
ప్రధానంగా రెండు తేదీలు:
డిసెంబర్ 12
డిసెంబర్ 24
ట్రేడ్ టాక్ ఏమంటోంది?
“12 అయితే హడావుడి అవుతుంది, టైమ్ తక్కువ.”
“24న క్రిస్మస్ సీజన్… మరింత స్ట్రాంగ్ ఓపెనింగ్.”
అందుకే మెజారిటీ 24 డిసెంబర్ వైపు మొగ్గు చూపినట్టు వార్తలు వచ్చాయి. కానీ… ఇక్కడే బిగ్ ట్విస్ట్!
బాలయ్య అభిమానులు దీన్ని ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం మొదలవగానే అభిమానులు షాకయ్యారు. వెంటనే ఉద్యమం స్టార్ట్! #బాలకృష్ణ #Akhanda2OnDec12 హ్యాష్‌ట్యాగ్స్‌తో కొన్ని గంటల్లోనే 50 వేల ట్వీట్లు వచ్చాయి. అదీ రిక్వెస్ట్ కాదు… స్ట్రాంగ్ వార్నింగ్!
12 డిసెంబర్ కోసం ప్రెషర్ – కానీ ప్రాక్టికల్ సమస్యలు పెద్దవే!
ఫ్యాన్స్ ఏమంటున్నారు? “5న సినిమా రాకపోవడం చాలానే హర్ట్ చేశింది… ఇంకో రెండు వారాలు అస్సలు వేచి ఉండం!”
అయితే, ప్రాక్టికల్ వైపు చూస్తే:
12కి రిలీజ్ అంటే ఈరోజే ఫైనల్ డిసిషన్
వరల్డ్ వైడ్ ప్లానింగ్
టికెట్ రేట్లు
స్పెషల్ షోల G.O
అడ్వాన్స్ బుకింగ్స్
ఇవన్నీ నాలుగు రోజుల్లో చేయడం చాలా కష్టం అని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే 24 డిసెంబర్ స్ట్రాంగ్ ఆప్షన్‌గా కనిపిస్తోంది.
మరి అభిమానుల ఆగ్రహం ఎలా చల్లారుస్తారు?
సినిమా 24నైతే, ఈ మధ్యలో ఫ్యాన్స్‌ని కూల్ చేయడం, మూమెంట్ ని కంటిన్యూ చేయడం ప్రొడ్యూసర్లు – డిస్ట్రిబ్యూటర్లకి కొత్త పరీక్షే!
ఒక్క మాట:
“డేట్ ఎవరిదైనా కావచ్చు… తాండవం మాత్రం బాలయ్యదే!”
