
ఐదు సార్లు MLA… కానీ ఇంకా సాధారణ మనిషి! ఇప్పుడు సినిమా
వచ్చే తరాలకు చూపించేందుకు ఒక లెజెండ్ ఉంది — ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఐదు సార్లు వరుసగా గెలిచాడు.
అధికారంలో ఉన్నా లోపలి నుండి మారలేదు. ఇప్పటికీ సాదాసీదా జీవితం. అదే ఆయన్ని ప్రత్యేకం చేసింది. ఆ పాత్రను ఇప్పుడు తెరపైకి తీసుకురావబోతున్నారు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్.
మూడు సంవత్సరాల రీసెర్చ్‌తో పుట్టిన కథ
డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే ఏమంటారంటే..: చిన్నప్పుడే తరిమెల నాగిరెడ్డి, సుందరయ్య లాంటి కమ్యూనిస్ట్ నాయకుల కథలు చదివాను. అదే స్పూర్తితో రియల్ టైమ్ నాయకుడిని వెతికాను. ఇల్లెందు వచ్చి నర్సయ్యను కలిశాను. 2019 నుంచి మూడు సంవత్సరాలు వందల మంది దగ్గర సమాచారం సేకరించాడు.
ఆయనతో ప్రయాణించిన వాళ్లు, ఆయన చేతిలో ఓడిపోయిన వాళ్లు – అందరి మాటలు విన్నాను. ఫైనల్‌గా ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ తయారైంది.
“గుమ్మడి నరసయ్య జీవితంతో ఐదు గంటల సినిమా తీసేయొచ్చు. కానీ ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు కట్టిపడేయడం మాకు ఛాలెంజ్.” అంటున్నారు నిర్మాత.
హీరో దొరికాడు, నిర్మాత దొరికాడు… కానీ ఒక్కొక్కరుగా!
ఈ కథ సినిమాగా రావడానికి రెండేళ్లు పట్టింది. హీరోకి నచ్చితే నిర్మాత దొరకలేదు. నిర్మాత దొరికితే హీరో దొరకలేదు. ఇద్దరు దొరికితే కథ మార్చమన్నారు
“మన దగ్గర ఇలాంటి సినిమాలు నడవవని చాలామంది అన్నారు.
కానీ తమిళ్, మలయాళంలో మాత్రం రన్ అవుతాయి వాళ్ళ నమ్మకం.” – డైరెక్టర్
చివరకు పాల్వంచ ఎన్. సురేశ్ రెడ్డి ‘ప్రవళ్లిక ఆర్ట్ క్రియేషన్స్’ పేరిట నిర్మించేందుకు ముందుకు వచ్చాడు.
కేవలం 20 రోజుల్లో స్టార్ ఒప్పందం!
ఏడాదిన్నర క్రితం స్క్రిప్ట్‌ను శివరాజ్‌కుమార్‌కు పంపారు. సెప్టెంబర్‌లో బెంగళూరుకు రావాలని కాల్. 20 రోజుల్లోనే OK! ఒకరోజు షూట్ చేసి టీజర్ విడుదల. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్.
షూటింగ్ లొకేషన్స్:
భద్రాద్రి జిల్లా
వరంగల్
కరీంనగర్
నిజమైన హీరో – రీల్ హీరో ఇంకా కలుసుకోలేదు!
గుమ్మడి నర్సయ్య & శివరాజ్‌కుమార్ – ఇంకా ముఖాముఖి కాలేదు. కేవలం ఫోన్‌లో మాత్రమే మాట్లాడుకున్నారు. షూటింగ్‌కు ముందు ఒక్కసారి కలిసే అవకాశం
ట్రైలర్ బయటకు రాగానే: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు,. కర్ణాటకలో కూడా భారీ రెస్పాన్స్
భావి తరాలకు స్ఫూర్తి
ఇది కేవలం బయోపిక్ కాదు. ఇది ఒక విలువల కథ. “ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా, గుమ్మడి గౌరవం పెంచేలా, తదుపరి తరాలకు స్ఫూర్తి ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది.” – డైరెక్టర్
