సినిమా వార్తలు

నైజాంలో బాలయ్య అఖండ రికార్డు? – వీక్ హీరో ఇమేజ్… ఇప్పుడు చరిత్రా?

ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉన్న మాటే— “సీనియర్ హీరోల్లో నైజాంలో బాలయ్య మార్కెట్ వీక్.” కానీ గత కొన్ని సినిమాలతో NBK ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాడు.
ఇప్పుడు అంచనాలు వేస్తున్నది ఒక్కటే— ‘అఖండ 2’ నైజాంలో బాలయ్య కెరీర్‌లోనే కాదు, సీనియర్ హీరోలలో కూడా ఆల్-టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తుందా?

అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే…సింపుల్‌గా చెప్పాలంటే—నైజాంలో తుఫాను వచ్చేస్తోంది!

పాత రికార్డులు ఇవే… ‘అఖండ 2’ వాటిని సులభంగా బ్రేక్ చేస్తుందా?

నైజాంలో ఇప్పటివరకు NBKకి అతిపెద్ద ఓపెనింగ్:

వీర సింహారెడ్డి – ₹7 కోట్లకు పైగా షేర్

ఇక సీనియర్ హీరోల్లో ఇప్పటి వరకూ నెంబర్ 1 ఓపెనింగ్:
సైరా నరసింహారెడ్డి – దాదాపు ₹8 కోట్లు షేర్

ఈ రెండు రికార్డులు ఏళ్లుగా నిలిచినా… ఇప్పుడు ‘అఖండ 2’ బుకింగ్ ట్రెండ్ చూసిన ట్రేడ్ మాటే— “ఇవి అన్నీ ఢీల్లేకుండా బ్రేక్ అవుతాయి!”

కారణాలు మూడు:

అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ . భారీ టికెట్ హైక్స్ , ప్రీమియర్‌లకి ఫ్లాట్ ₹600 ధర

ఇవన్నీ కలిసి ఓపెనింగ్ షేర్‌ను అతి పెద్ద రేంజ్‌కు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.

డబుల్ డిజిట్ నైజాం షేర్? – బాలయ్యకు ఇది మొదటిసారే!

ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చ:
“ప్రీమియర్ టాక్ పాజిటివ్ అయితే, నైజాంలో డబుల్ డిజిట్ షేర్ సాధ్యమా?”

అది జరిగితే—
సీనియర్ హీరోల్లో నైజాంలో డబుల్ డిజిట్ ఓపెనింగ్ సాధించిన ఫస్ట్ హీరో బాలయ్య అవుతాడు!
NBK మార్కెట్‌ను నైజాంలో పూర్తిగా రీడిఫైన్ చేసే క్షణం అవుతుంది.

ఓపెనింగ్ ట్రెండ్ చూస్తుంటే,
‘అఖండ 2’ నైజాంలో అఖండ కలెక్షన్స్ తెస్తుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది!

Similar Posts