సినిమా వార్తలు

‘పరాశక్తి’ OTT డీల్ షాక్: ZEE5 ఎంత పెట్టిందో తెలుసా?

శివ కార్తికేయన్ – నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పరాశక్తి సినిమా మీద అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో, ఇప్పుడు ఓటీటీ డీల్ చూసి అర్థమవుతోంది. 2026 పొంగల్ / సంక్రాంతికి థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ZEE5 భారీ ధరకు దక్కించుకుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం… ఈ డీల్ విలువ ఏకంగా 52 కోట్లు!

52 కోట్లు ఎందుకు? ఈ కాంబో మ్యాజిక్ ఇదే!

ZEE5 ఇప్పటివరకు ఏ సినిమాకు ఇవ్వనంత భారీ మొత్తాన్ని ఈ ప్రాజెక్టుపై పెట్టిందంటే, దానికి కారణం స్పష్టమే.

శివ కార్తికేయన్ మార్కెట్
ఆకాశమే నీ హద్దురా తర్వాత సుధా కొంగరపై ఉన్న నమ్మకం
పొలిటికల్–హిస్టారికల్ డ్రామా అనే స్ట్రాంగ్ జానర్

ఈ మూడు కలిసి పరాశక్తి కి భారీ ఓటీటీ వ్యాల్యూ తీసుకొచ్చాయి. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ బాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం,.రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత వెయిట్ యాడ్ చేస్తున్నాయి. ఆకాశం నీ హ‌ద్దురా ఫేం డైరెక్టర్‌ సుధా కొంగ‌ర (Sudha Kongara) డైరెక్ట్‌ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పొలిటికల్ హిస్టారికల్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న పరాశక్తిలో రానా కీలక పాత్రలో నటిస్తుండగా.. అథర్వ, రవి మోహన్‌, బాసిల్ జోసెఫ్‌ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు.

ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్‌కు ముందే రికార్డ్ డిజిటల్ డీల్ క్లోజ్ కావడంతో, సంక్రాంతి 2026కి పరాశక్తి కేవలం థియేటర్లలోనే కాదు… ఓటీటీలో కూడా భారీ ఆట ఆడబోతోందని స్పష్టమవుతోంది!

మరో ప్రక్క పరాశక్తి మూవీ అనుకున్న షెడ్యూల్ కంటే ముందే థియేటర్లలోకి వచ్చే అవకాశమున్నట్టు ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ మూవీ 2026 పొంగళ్‌ కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. తాజా టాక్‌ ప్రకారం కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్‌ జననాయగన్‌తో పరాశక్తికి బాక్సాఫీస్‌ వద్ద పోటీ ఉండబోతుందట.

దీనిక్కారణం తెలుగులో రెండు మూడు పెద్ద సినిమాలు విడుదల కావడమేనని ఇన్‌సైడ్‌ టాక్‌. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న రాజాసాబ్‌ కూడా ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో థియేటర్ల సంఖ్య తక్కువగా దొరికే అవకాశం ఉంటుందని భావిస్తున్న మేకర్స్‌ పరాశక్తి సినిమాను జనవరి 9న కానీ 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్‌ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ఫలితాలు వస్తాయనేది సస్పెన్స్‌గా మారింది.

Similar Posts