సినిమా వార్తలు

షాక్! కార్తీ కొత్త రిలీజ్‌పై సుప్రీంకోర్ట్ తుది నిర్ణయం ఇదేనా?

కార్తీ కెరీర్‌లో ఇది కేవలం మరో సినిమా కాదు. నిర్మాత, స్నేహితుడు కె.ఈ. జ్ఞానవేల్‌రాజా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయనకు అండగా నిలబడుతూ కార్తీ ‘వా వాత్తియార్’ సినిమాను ఒప్పుకున్నారు. షూటింగ్‌ను సమయానికి పూర్తి చేసి, నిర్మాతకు ఊరట కలిగించాలని ప్రయత్నించారు. అన్ని అనుకున్నట్లే జరిగితే ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలోకి రావాల్సి ఉంది . కానీ చివరి నిమిషంలో మరోసారి పరిస్థితులు తారుమారయ్యాయి.

కోర్ట్ స్టే, సుప్రీంకోర్ట్ షాక్… OTT ప్రెషర్ మరోవైపు

జ్ఞానవేల్‌రాజా గతంలో ని పెండింగ్ బాకీలను క్లియర్ చేయలేకపోవడంతో , సినిమా రిలీజ్ నిలిచిపోయింది. సమస్యలను పరిష్కరించి క్రిస్మస్ సీజన్‌లో అయినా రిలీజ్ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో, మద్రాస్ హైకోర్ట్ సినిమా విడుదలపై స్టే విధించింది.

దీంతో చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడి నుంచి కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్ట్ స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది. ఇదే సమయంలో మరో వైపు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రెషర్ మొదలైంది. భారీ ధరకు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన ప్రైమ్ వీడియో, సినిమా క్రిస్మస్‌కు ముందే రిలీజ్ కావాలంటూ ఒత్తిడి పెంచిందని సమాచారం.

ఈ ఏడాది లేదు… OTT డీల్ నుంచి అమెజాన్ ఔట్?

తాజా పరిణామాలతో ‘వా వాత్తియార్’ క్రిస్మస్ రిలీజ్ కూడా కుదరదని స్పష్టమైంది . అంతేకాదు, ఈ సినిమా 2025లో విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం. రిలీజ్‌పై స్పష్టత లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రస్తుతం డిజిటల్ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది చిత్రబృందానికి, ముఖ్యంగా జ్ఞానవేల్‌రాజాకు భారీ ఆర్థిక దెబ్బగా మారింది .

కార్తీ తన వంతు ప్రయత్నం చేసి నిర్మాతకు అండగా నిలిచినా, చట్టపరమైన అడ్డంకులు, ఆర్థిక సమస్యలు మాత్రం తీరలేదు. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో డబ్ అయిన ఈ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం , కృతి శెట్టి హీరోయిన్.

ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే—

ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుంది?

OTT డీల్ మళ్లీ రివైవ్ అవుతుందా? లేక సమస్యలు మరింత పెరుగుతాయా?

సమాధానం కోసం కార్తీ ఫ్యాన్స్ ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

Similar Posts