సినిమా వార్తలు

2025లో గూగుల్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్

థియేటర్లలో సినిమా లేకపోయినా, అధికారిక అప్డేట్ రాకపోయినా… అల్లు అర్జున్ పేరు మాత్రం 2025 మొత్తం గూగుల్‌లో మోగిపోయింది. అభిమానులు AA22 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే, బన్నీ మరో పెద్ద సంబరానికి కారణమయ్యాడు. 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాలీవుడ్ నటుడిగా అల్లు అర్జున్ నంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు. ఇది కేవలం ఒక లిస్ట్ కాదు… ఆయన స్టార్డమ్ ఎక్కడికి వెళ్లిందో చెప్పే స్పష్టమైన సూచన.

‘పుష్ప 2’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్, ఆ తర్వాత తన కెరీర్‌లోనే అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న AA22పై ఫోకస్ పెట్టాడు. తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో కలిసి భారీ బడ్జెట్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా మీద దేశవ్యాప్తంగా కాదు… ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. అదే ఆసక్తి, అదే క్రేజ్ గూగుల్ సెర్చ్‌ల రూపంలో 2025లో బయటపడింది.

డిసెంబర్ 24, 2025న సేకరించిన వరల్డ్‌వైడ్ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ప్రకారం, టాలీవుడ్ నటుల్లో అల్లు అర్జున్ టాప్‌లో నిలిచాడు. ఆయన తర్వాతి స్థానాల్లో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఉన్నారు. ఈ లిస్ట్ చూస్తే ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది… అల్లు అర్జున్ పేరు ఇప్పుడు కేవలం టాలీవుడ్ వరకే కాదు, గ్లోబల్ లెవెల్‌లో మాట్లాడే బ్రాండ్‌గా మారింది.

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ స్టార్డమ్ మరో లెవెల్‌కి వెళ్లబోతోందన్న చర్చలు ఇండస్ట్రీలో బాగా నడుస్తున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆయన నాలుగోసారి చేతులు కలపబోతున్నారనే వార్తలు అభిమానుల్లో హై ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి. ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ లాంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత ఈ కాంబినేషన్ నుంచి వచ్చే సినిమా మీద అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ ఒక మైథలాజికల్ కాన్సెప్ట్‌తో, పురాణాల్ని ఫ్యూచరిస్టిక్ నేరేటివ్‌తో లింక్ చేస్తుందనే టాక్ మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ఒక దశలో ఈ కథ ఎన్టీఆర్‌తో తెరకెక్కుతుందన్న ప్రచారం వచ్చినా, ఇప్పుడు మళ్లీ అది అల్లు అర్జున్ లైనప్‌లోకి వచ్చిందన్న బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే… బన్నీ ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.

వరుసగా భారీ ప్రాజెక్టులు, బాక్సాఫీస్ రికార్డులు, గ్లోబల్ రీచ్… ఇవన్నీ కలిసే 2025లో అల్లు అర్జున్ గూగుల్ సెర్చ్‌ల్లో నంబర్ వన్ అయ్యేలా చేశాయి. సినిమా అప్డేట్ రాకముందే ఈ రేంజ్ క్రేజ్ అంటే, అసలు సినిమాలు మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ప్రశ్నే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

Similar Posts