
సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో 300 కోట్ల భారీ వసూళ్లు సాధించి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టిన విక్టరీ వెంకటేష్, ఇప్పుడు మళ్లీ పెద్ద ప్రాజెక్ట్‌తో రెడీ అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’లో అతిథి పాత్రతో మెరిసిన వెంకీ, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సోలో హీరోగా నటిస్తున్నారు.
అక్టోబర్ 8 బుధవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ‘గుంటూరు కారం’ తర్వాత దాదాపు 20 నెలల గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్, మళ్లీ కెమెరా వెనక్కి వెళ్లి తన స్టైల్లోనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొదలుపెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి ఫిక్స్ అయ్యింది. 2026 సమ్మర్ రిలీజ్ టార్గెట్‌తో త్రివిక్రమ్ స్పీడ్‌లో షూట్ మొదలుపెట్టారు.
మరి టైటిల్ ఏంటి అంటే? ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాక్ — ‘అబ్బాయిగారు 60 ప్లస్’!
అవును, అదే ఓల్డ్ టైమ్ సూపర్ హిట్ ఈవీవీ సత్యనారాయణ – వెంకీ కాంబినేషన్ మూవీ ‘అబ్బాయిగారు’ని త్రివిక్రమ్ తన స్టైల్లో మళ్లీ లెవెల్ అప్ చేయబోతున్నాడట.
వెంకీ ఈ సినిమాలో ముదురు బ్రహ్మచారి, పెళ్లికాని ప్రసాద్ స్టైల్ హ్యూమరస్ క్యారెక్టర్‌లో కనబడతారని టాక్. ఫుల్ ఫ్యామిలీ సబ్జెక్ట్‌గా, ఎలాంటి యాక్షన్ లేకుండా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్‌గా తయారవుతోందట ఈ సినిమా.
తమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ రైటింగ్, వెంకీ టైమింగ్ — ఈ కాంబో ఒక్కదానితోనే ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ లెవెల్ పీక్‌లో ఉంది.
‘అబ్బాయిగారు 60 ప్లస్’ నిజంగానే టైటిలా? లేక త్రివిక్రమ్ మరో ట్విస్ట్ పెట్టాడా?
చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతోందట.
వెంకీ ఫ్యాన్స్… రెడీగా ఉండండి – ఈసారి త్రివిక్రమ్ మార్క్ క్లాసిక్ గ్యారంటీ!
