సినీ పరిశ్రమ సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త ఆస్కార్ కేటగిరీని ప్రకటించింది .’స్టంట్ డిజైన్’ కేటగిరిలో కూడా అవార్డ్స్ ను ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. 2027 వ సంవత్సరం నుంచి వచ్చే ప్రతి సినిమాకి ఈ జాబితాలో ఉన్న స్టంట్ డిజైన్ కేటగిరి వర్తిస్తుందని వాళ్ళు పేర్కొన్నారు.

ఇక 100 వ అకాడమీ అవార్డుల్లో బాగంగా వెల్లడించే జాబితాలో ఈ కేటగిరిని అధికారికం చేయనున్నారు…ఇక దీనిపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఇక తాజాగా ఆస్కార్ కొత్త జాబితాను ప్రకటించే క్రమంలో వాళ్ళు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు…అందులో త్రిబుల్ ఆర్ ఇమేజ్ ను కూడా చేర్చారు. మూడు సినిమాల కలయిక తో ఈ పోస్టర్ ను రెడీ చేశారు…ఈ మూడు పోస్టర్ల కలయిక తో కొత్త కేటగిరి అయిన స్టంట్ డిజైన్ గురించి వెల్లడించారు.

ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్, ఆర్ ఆర్ ఆర్, మిషన్ ఇంపాజిబుల్ సినిమా ల్లోని స్టంట్ ఇమేజ్స్ తో ఈ పోస్టర్ ను రెడీ చేశారు…రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ కి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది.

ప్రస్తుతం 2027 నుంచి అందుబాటులోకి వస్తున్న స్టంట్ డిజైన్ కేటగిరి మీద రాజమౌళి స్పందిస్తూ వందేళ్ళ నిరీక్షణలో ఆస్కార్ అవార్డు వేడుకలో మన త్రిబుల్ ఆర్ సినిమా పోస్టర్ ను వాడడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అంటూ తన ఆనందాన్ని వెల్లడిస్తున్నాడు.

, , , ,
You may also like
Latest Posts from