సినిమా వార్తలు

రుక్మిణికి బాలీవుడ్ కాల్!

కాంతారా: చాప్టర్ 1 విజయంతో రుక్మిణి వసంత్ పేరు ఒక్కసారిగా పాన్-ఇండియా మ్యాప్‌పై బలంగా నిలిచిపోయింది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రమే దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, నార్త్ ఇండియాలో ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. ఇంతవరకు ఒక సెక్షన్ ఆడియన్స్‌కే పరిమితమైన పేరు… ఇప్పుడు బాలీవుడ్ వరకు వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆమె చుట్టూ కొత్త అంచనాలు కూడా మొదలయ్యాయి.

ఈ క్రేజ్‌కి తగ్గట్టే ఇప్పుడు రుక్మిణి వసంత్ వైపు బాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రుక్మిణి, హిందీ సినిమాల నుంచి పలు ఆసక్తికరమైన ప్రతిపాదనలు తన వద్దకు వచ్చాయని, వాటిలో కొన్ని తనను “చాలా, చాలా ఎగ్జైట్” చేశాయని చెప్పడం హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టే అవకాశం దగ్గర్లోనే ఉందన్న సంకేతాలను ఆమె మాటలు స్పష్టంగా ఇస్తున్నాయి.

ఇక కెరీర్ పరంగా చూస్తే, రుక్మిణి ప్రస్తుతం పూర్తిగా పాన్-ఇండియా ట్రాక్‌లోనే దూసుకుపోతోంది. ఆమె తదుపరి చిత్రం యశ్‌తో కలిసి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’. దీనిపై ఇప్పటికే భారీ బజ్ ఉంది. అంతేకాదు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’లో కూడా రుక్మిణి లీడ్ హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

మొత్తానికి కాంతారా ఇచ్చిన బలమైన పుష్‌తో, సౌత్ నుంచి నార్త్ వరకు రుక్మిణి వసంత్ ప్రయాణం కొత్త దశలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ డెబ్యూ అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ అవుతుందో అన్నదే ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారింది. ఆమె తీసుకునే తదుపరి నిర్ణయం, ఆమె కెరీర్‌ను ఇంకో లెవల్‌కి తీసుకెళ్లే అవకాశముందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Similar Posts