స్టార్ డమ్ కంటే ఇక నుంచటి పాత్ర బలం మీద నమ్ముకోవాలనకుంటున్న నాగ్ — ఇటీవలి కాలంలో బ్రహ్మాస్త్ర, కూలీ, కుబేర లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఓ కొత్త గమనాన్ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా ధనుష్‌తో కలిసి నటించిన కుబేర లో నాగార్జున పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఆయన దృష్టి రెండు కొత్త సినిమాలపై ఉంది. అందులో ఒకటి — తమిళ రీమేక్ అని తెలుస్తోంది! అది మరేదో కాదు అయోథి .

తమిళంలో శశికుమార్ నటించిన అయోథి చిత్రం ఓ ఎమోషనల్ డ్రామా. రీసెంట్ గా చూసిన ఈ సినిమా నాగార్జునను ఎంతగానో ఆకట్టుకుందని సమాచారం. కుటుంబ బాంధవ్యాల, మానవీయ విలువల చుట్టూ తిరిగే ఈ కథను తెలుగులో రీమేక్ చేయాలని నాగ్ ఆసక్తిగా ఉన్నారట. ప్రస్తుతం ట్రైడెంట్ ఆర్ట్స్‌తో చర్చలు జరుగుతున్నాయి.

ఇక ఇదే సమయంలో నాగార్జున 100వ సినిమా గురించిన చర్చలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ స్పెషల్ ప్రాజెక్ట్‌కు తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహించనున్నాడని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఆగస్ట్ 29న నాగార్జున బర్త్‌డే సందర్భంగా — ఈ రెండు సినిమాల గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

, , , ,
You may also like
Latest Posts from