టాలీవుడ్‌లో స్టార్ పవర్, పబ్లిక్‌లో రాజకీయ హవా – ఈ రెండింటినీ ఒకేసారి మేనేజ్ చేస్తూ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన క్రేజ్‌తో ముందుకు సాగుతున్నారు. ఒకవైపు జనసేన పార్టీ కార్యకలాపాలు, రాజకీయ బిజీ షెడ్యూల్ – మరోవైపు పూర్తిచేయాల్సిన సినిమా కమిట్‌మెంట్స్… ఈ రెండు మధ్య సమతౌల్యం పాటిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో హరి హర వీర మల్లు సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దానికి కొనసాగింపుగా ఓజీ షూటింగ్‌ను కూడా ముగించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ దగ్గర పవన్ కళ్యాణ్ తన చివరి దశలోకి అడుగుపెట్టబోతున్నారు. సినిమాలో ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఒక్క షెడ్యూల్ మాత్రమే. రాబోయే వారాంతంలో లేదా వచ్చే వారం ఆ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తనకి ఉన్న అన్ని సినిమా కమిట్‌మెంట్స్ పూర్తి చేసినవారవుతారు. ఇకపై ఆయన ఫుల్ టైమ్‌గా రాజకీయాలపైనే దృష్టి సారించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.
పవన్ క్రేజ్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఈ సినిమాతో ఆయన ఫిల్మ్ జర్నీ ఒక మైలురాయిగా మిగిలిపోనుంది.
