తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన వివేక్ ఆత్రేయ త్వరలో సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయబోతున్నారా? అనే హాట్ టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌గానే చర్చ నెడుస్తోంది! కామెడీ, లవ్ స్టోరీస్‌కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ, తాజాగా ‘సరిపోదా శనివారం’తో మాస్ సినిమా కూడా ఈజీగా తీయగలడని నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు మాస్‌కి తగ్గట్టుగా ఓ గ్యాంగ్‌స్టర్ కథను సిద్ధం చేశారని సమాచారం.

రజినీకి కథ వినిపించాడా?

అంతే సుందరానికీ చిత్ర దర్శకుడైన వివేక్ ఆత్రేయ – రజినీకాంత్‌కి ఈ గ్యాంగ్‌స్టర్ స్టోరీ వినిపించారట. ఇప్పటి వరకు రజినీ ఓకే చెప్పలేదని టాక్, కానీ ఈ కథపై ఆసక్తిగా ఉన్నారని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం రజినీ ‘జైలర్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి రిలీజ్ ‘కూలీ’ – ఇది 2025 ఆగస్ట్ 14న విడుదల కానుంది.

ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే..?

ఈ కలయిక ఫిక్స్ అయితే, మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నారు. రజినీకాంత్ స్థాయిలో ఓ సినిమా చెయ్యడం – వివేక్ ఆత్రేయ కెరీర్‌లో గోల్డ్‌న్ ఛాన్స్‌గానే చెప్పొచ్చు!

ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కానీ… రజినీ – ఆత్రేయ కాంబినేషన్ ఫిక్స్ అయితే, దక్షిణాదిన కొత్త సంచలనం ఖాయం!

, , ,
You may also like
Latest Posts from