
జైలర్ 2లో మళ్లీ ‘కావాలా’ ఎఫెక్ట్? నోరా ఫతేహీ ఎంట్రీతో హైప్
‘జైలర్’తో ఒక్క పాట ఎలా దేశవ్యాప్తంగా హైప్‌ని క్రియేట్ చేయగలదో చూపించారు మేకర్స్. తమన్నా చేసిన ‘కావాలా’ పాట సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియా, రీల్స్, ఫ్యాన్ ట్రెండ్స్‌తో అగ్ని పర్వతంలా పేలింది. ఆ పాట ఇచ్చిన బజ్‌కి ‘జైలర్’ రజనీకాంత్ కెరీర్లోనే ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ని మరోసారి రిపీట్ చేయాలనే లక్ష్యంతో ‘జైలర్ 2’ టీమ్ అడుగులు వేస్తోంది.
ఈసారి ఆ స్పెషల్ సాంగ్ బాధ్యత నోరా ఫతేహీకి అప్పగించారు. తాజా సమాచారం ప్రకారం, ‘జైలర్ 2’ కోసం నోరా ఇప్పటికే స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. చెన్నైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్న ఈ నంబర్, మ్యూజిక్ పరంగా కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. ‘కావాలా’ తర్వాత మరోసారి థియేటర్లను ఊపే పాటగా దీన్ని తీర్చిదిద్దాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నోరా ఫతేహీకి స్పెషల్ సాంగ్స్ అంటేనే ప్రత్యేక బ్రాండ్ ఉంది. బాలీవుడ్ నుంచీ సౌత్ వరకూ ఆమె చేసిన ఐటమ్ నంబర్లు ట్రెండ్స్ సెట్ చేశాయి. ‘బాహుబలి’, ‘ఊపిరి’, ‘కిక్ 2’ వంటి తెలుగు సినిమాల్లో కనిపించిన నోరా, ఇటీవల వరుణ్ తేజ్ ‘మట్కా’లో నెగటివ్ షేడ్ పాత్రతో సర్ప్రైజ్ చేసింది. డ్యాన్స్ మాత్రమే కాదు, నటనలో కూడా వేరియేషన్ చూపించగలదని మరోసారి ప్రూవ్ చేసింది.
ఇదిలా ఉండగా, నోరా త్వరలో ‘కాంచనా 4’లో కీలక పాత్రలో కనిపించనుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆమె పాత్రపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఒకవైపు స్పెషల్ సాంగ్స్, మరోవైపు కీలక పాత్రలు అంటూ సౌత్‌లో నోరా గ్రాఫ్ మెల్లగా పైకెత్తుతున్నట్టు కనిపిస్తోంది.
‘జైలర్’ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, రమ్యకృష్ణ, విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. జూన్ 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో నోరా స్పెషల్ సాంగ్ మరోసారి దేశవ్యాప్తంగా వైరల్ అవుతుందా అనే క్యూరియాసిటీ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది.
