ఇప్పుడో వార్త మీడియా సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తోంది. తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్ద ఆహా… ఒక్కరోజులో 75 మంది ఉద్యోగులను తొలగించిందని ఆ వార్త సారాంశం. ముందస్తు సమాచారం లేకుండానే ఉద్యోగాలు కోల్పోవడంతో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని చెప్తున్నారు. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ వార్త వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
ఇక అచిరకాలంలోనే నంబర్‌వన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ‘ఆహా’ నిలిచింది. తెలుగుభాషలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉండాలని, కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు అందించాలనే ఆహా ని ప్రారంభించారు.అలాగే ‘ఆహా 2.ఓ ’ ఓటీటీ వెర్షన్‌ను సైతం మొదలెట్టారు.
అల్లు అరవింద్‌తో పాటు రామేశ్వరరావు జూపల్లి, రామ్‌జూపల్లి తపన, కృషి వల్లే ‘ఆహా’ అత్యున్నత స్థాయికి చేరుకున్నదిని చెప్తారు. తెలుగు వారికి కొత్త తరహా వినోదాన్ని అందించాలనేదే ‘ఆహా’ మొదలుపెట్టిన రోజు అల్లు అరవింద్ కన్న కల .
‘199 దేశాల్లో ఆహా సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ‘ఆహా’ గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తున్నది. ప్రతీవారం కొత్త సినిమాలు, సిరీస్‌లతో మన మందుకు వస్తోంది.