బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తన నెక్ట్స్ సినిమాల కంటే కూడా ఇప్పుడు తన విజనరీ ప్లాన్‌తో వార్తల్లో నిలిచారు. ఆయన ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలసి ఓ భారీ ప్రతిపాదనతో ముందుకొచ్చారు – అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియోను తెలంగాణలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో!

ఢిల్లీ మీటింగ్‌లో కీలక చర్చలు

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం జరిగిన ఈ సమావేశంలో అజయ్ దేవగన్ స్టూడియో ప్రాజెక్ట్‌ను ప్రస్తావించారు. ఈ విషయాన్ని సీఎం అధికారిక X (Twitter) ఖాతాలో ఫొటోలు సహా వెల్లడించారు.

CM అధికారిక పోస్ట్‌ లో ఇలా వుంది:

“ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగన్ గారు సీఎం శ్రీ రేవంత్ రెడ్డిని కలసి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియోను తెలంగాణలో ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.”

ఏం ఉండబోతోంది ఈ స్టూడియోలో?

వివరాల్లోకి వెళితే… ఈ స్టూడియోలో అనిమేషన్, VFX స్టూడియోలు, ఎయ్ (AI), స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ వంటి ఆధునిక పరికరాలు, వేదికలు ఉండనున్నాయని సమాచారం. అంటే, టెక్నాలజీ + సినిమాటిక్ క్రాఫ్ట్ కలిపి ఉండే ప్రాజెక్ట్ ఇది.

అజయ్ దేవగన్ ఫిల్మ్ స్టూడియోతో పాటు, ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నికల్ టాలెంట్‌ను డెవలప్ చేయడానికి ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని కూడా తెలిపారు.

ఇది నిజమైతే… టాలీవుడ్‌కు మైలురాయి!

తెలంగాణలో ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నా, తాజాగా అజయ్ దేవగన్ ప్రతిపాదిస్తున్న ప్రాజెక్ట్ రీజియన్‌ను వర్చువల్ ప్రొడక్షన్, హై ఎండ్ టెక్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చే అవకాశం ఉంది. ఇది జరిగితే టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలకు బోనస్‌లాంటిదే.అజయ్ దేవగన్ నెక్ట్స్ మూవీ: Son of Sardaar 2

ఇక సినిమాల విషయానికొస్తే… అజయ్ దేవగన్ త్వరలో Son of Sardaar 2 సినిమాతో థియేటర్లలోకి రానున్నారు. ఈ సినిమాలో ఆయన మళ్లీ జస్సీగా కనిపించనుండగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రవి కిషన్, సంజయ్ మిశ్రా, నీరో బజ్వా, విన్దు దారా సింగ్, అశ్విని కల్సేకర్, కుబ్రా సైత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, టీ సిరీస్ కలిసి నిర్మిస్తున్నాయి. జూలై 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

, , ,
You may also like
Latest Posts from