గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అవెయిటెడ్ మూవీ ‘అఖండ 2’. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్, మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో బాలయ్య అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో ఊపందుకుంది. ఊహించని రేట్లుకు డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. తాజాగా ఓటిటి డీల్ క్లోజ్ అయ్యిందని వినికిడి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ బయటకు వచ్చాయి. సమాచారం ప్రకారం – శాటిలైట్ హక్కులు స్టార్ మా సొంతం కాగా, డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదటి భాగానికి కూడా ఇదే డిజిటల్ ప్లాట్‌ఫామ్ భాగస్వామి కావడం.
అలాగే దాదాపు రూ.85 కోట్లకు డీల్ ముగించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, సంక్రాంతి సెలవుల సీజన్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండేలా డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
మొదట సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్, VFX పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ 25గా లాక్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా, అదీ పినిశెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం థమన్ అందిస్తున్నారు.
మొత్తానికి, ‘అఖండ 2’ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డిజిటల్, శాటిలైట్ డీల్‌లు కూడా ఫిక్స్ అవ్వడంతో, ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అంతా థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు.
