సినిమా వార్తలు

‘అఖండ 2’ ఓటిటి రిలీజ్ డేట్

ఎన్నో అడ్డంకులు, వారం రోజుల వాయిదా, భారీ అంచనాలు… చివరకు డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను చిత్రం ‘అఖండ 2’, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. మిక్స్‌డ్ టాక్, నెగటివ్ రివ్యూస్ కారణంగా సినిమా థియేటర్ రన్‌పై సందేహాలు మొదలయ్యాయి. అదే సమయంలో, సాధారణ ప్రేక్షకుల్లో ఒక ప్రశ్న బలంగా వినిపిస్తోంది “అఖండ 2 OTTలో ఎప్పుడు వస్తుంది?

ఫస్ట్ వీకెండ్‌కే క్లియర్ సిగ్నల్

‘అఖండ 2’కి థియేటర్లలో వర్డ్ ఆఫ్ మౌత్ పెద్దగా కలిసి రాలేదు. ఫస్ట్ వీకెండ్‌కు సినిమా షేర్ వసూళ్లు సుమారు 50 కోట్ల పరిధిలోనే ఆగిపోయాయి. ఇది మొత్తం బిజినెస్‌తో పోలిస్తే 50% కన్నా తక్కువ రికవరీ. ఇప్పుడు బయ్యర్లకు కనీసం 2/3 రికవరీ రావాలంటే, వీక్‌డేస్‌లో సినిమా అసాధారణంగా హోల్డ్ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓటిటి ఆశలు :

బాక్సాఫీస్‌లో స్ట్రగుల్ ఉన్నా, OTT విషయంలో మాత్రం ఓ పెద్ద ప్లస్ ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను Netflix రికార్డు ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, జనవరి 9, 2026 నుంచి ‘అఖండ 2’ Netflixలో స్ట్రీమింగ్‌కి రానుంది. థియేటర్ రన్‌పై ఆసక్తి తగ్గిన సాధారణ ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు ఇప్పుడు OTT రిలీజ్‌కే ఎదురుచూస్తున్నారు.

హిందీ వెర్షన్ : ఓటీటి విండో వల్ల మల్టీప్లెక్స్‌లకు దూరం అయ్యింది . ‘అఖండ 2’ హిందీలో కూడా రిలీజ్ అయినప్పటికీ 4 వారాల థియేటర్-టు-OTT విండో రూల్ కారణంగా నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్‌లో ఈ సినిమా స్క్రీనింగ్ జరగలేదు. దీంతో హిందీ మార్కెట్‌లో సినిమాకు పెద్దగా ఎక్స్‌పోజర్ రాకపోవడం కూడా బాక్సాఫీస్‌పై ప్రభావం చూపిన అంశంగా ట్రేడ్ భావిస్తోంది.

ఫైనల్ గా థియేటర్లలో కాదు… OTTలోనే అసలు పరీక్ష!

మొత్తంగా చూస్తే, ‘అఖండ 2’కి థియేటర్ రన్ కన్నా OTT రన్‌నే కీలకం అవుతోంది. బాక్సాఫీస్ వద్ద తడబడిన ఈ సీక్వెల్, Netflixలో స్ట్రీమింగ్ మొదలైన తర్వాత సాధారణ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే – OTTలో ‘అఖండ 2’కు ఫస్ట్ పార్ట్‌లా రీస్పాన్స్ వస్తుందా? లేక థియేటర్ టాక్ అక్కడికీ వెంటాడుతుందా?

Similar Posts