సినిమా వార్తలు

షాకిస్తున్న “అఖండ 2″ ప్రీమియర్స్‌ డీల్? ఒక్కో షో రేట్ వింటే మైండ్ బ్లాక్!

అఖండ 2 రిలీజ్‌కు ముందే భారీ హవా క్రియేట్ చేస్తోంది. టికెట్ రేట్ల హైక్, స్పెషల్ షోలు, పెయిడ్ ప్రీమియర్స్—తో మారు మ్రోగిపోతోంది! టికెట్ హైక్ మరియు స్పెషల్ షోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలంగాణలో కూడా అనుమతులు త్వరలోనే రానున్నాయని తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ సింగిల్ స్క్రీన్ల ప్రీమియర్‌ల కోసం ₹50 లక్షల రికార్డ్ డీల్ జరిగింది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు జరగని అరుదైన డీల్ అని చెప్తున్నారు.

“హైదరాబాద్‌లో ఏకంగా 50 లక్షల డీల్… ఒక రాత్రికే?”

హైదరాబాద్ సింగిల్ స్క్రీన్ ప్రీమియర్స్ కోసం చరిత్రలో మరిచిపోలేని డీల్ క్లోజ్ అయింది. US & గుంటూరు డిస్ట్రిబ్యూటర్ వెంకట్ ఏకంగా ₹50 లక్షలు పెట్టి ప్రీమియర్ హక్కులు దక్కించుకున్నారు. అదీ ఐదు షోలకే — అంటే ఒక్కో షో ధర 10 లక్షలు! ఇంతకుముందెప్పుడూ చూడని రేంజ్‌లో ఈ డీల్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.

హైదరాబాద్ లోని భ్రమరాంబ, మల్లికార్జున, శ్రీ రాములు వంటి సింగిల్ స్క్రీన్లలో NBK ప్రీమియర్ క్రేజ్ వేరు. టికెట్లు దొరకడమే కష్టమని తెలిసిన ఫ్యాన్స్ ముందుగానే భారీ మొత్తానికి షోలు బ్లాక్ చేసుకున్నారట. ఈ క్రమంలో వెంకట్ ఉప్పుటూరితో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ ప్రీమియర్ డీల్‌లో ఉంటే ఆశ్చర్యమేముంది?

“బోయపాటి – బాలయ్య కాంబో మళ్ళీ రచ్చ చేస్తుందా?”

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2లో బాలకృష్ణ, ఆది పినిసెట్టి, సంయుక్త కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో వచ్చిన ఈ భారీ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

Similar Posts