వీడియోలుసినిమా వార్తలు

‘అఖండ 2 తాండవం’ సాంగ్ ఔట్: బాలయ్య శివరూపం చూసి ఫ్యాన్స్ షాక్!

అఖండ ఏ స్థాయిలో కల్ట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే కాంబినేషన్— నటసింహం నందమూరి బాలకృష్ణ + బ్లాక్‌బస్టర్ మెషీన్ బోయపాటి శ్రీను—మళ్లీ ఆ ఊపు తెప్పించడానికి ‘అఖండ 2’తో వచ్చేస్తున్నారు.

డిసెంబర్ 5 రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సీక్వెల్‌కు ముంబై జూహూలో రిలీజ్ చేసిన ‘తాండవం’ ఫస్ట్ సింగల్ అక్షరాలా ఆన్‌లైన్‌లో తుఫాన్ లేపింది. థమన్ ఈ సారి కూడా బాలయ్యకోసం స్పెషల్‌గా నిలువెత్తు హై-వోల్టేజ్ డివోషనల్ బేస్ ఇచ్చాడు. పాట మొదలయ్యిన క్షణం నుంచి
“గూస్‌బంప్స్ గ్యారంటీ” ఫీలింగ్ వచ్చేలా స్కోర్ ఇచ్చాడు.

శంకర్ మహదేవన్–కైలాష్ ఖేర్ డ్యూయల్ వోకల్స్‌తో ఈ సాంగ్ శివతాండవం తాలూకు దైవక్రోధాన్ని నేరుగా మనస్సుల్లో దింపేస్తుంది.

బోయపాటి శ్రీను చూపించిన బాలయ్య అఘోర లుక్… ఆ ఎక్స్‌ప్రెషన్స్…
మంచుతో కప్పుకున్న పర్వతాల్లో షూట్ చేసిన గ్రాండ్ విజువల్స్…
ఇవన్నీ కలిపి సాంగ్‌ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి.

కల్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ కూడా ఫ్యాన్స్‌కి స్పెషల్ దైవిక హై ఇచ్చేలా ఉన్నాయి—

“రంగ రంగ శంభు లింగ ఈశ్వర…
అంతరంగా హే భుజంగా శంకర…”

టైటిల్‌కు తగ్గట్టుగానే బాలయ్య చేసిన తాండవం ఈ పాటలో హైలైట్ ఆఫ్ ది ఈవెంట్.

ఈ ఒక్క సింగిల్‌తోనే అభిమానుల్లో ఒకే మాట—
“అఖండ 2 మ్యూజికల్ జర్నీకి ఇది పవర్‌ఫుల్ స్టార్ట్… ఇంకో లెవెల్”

Similar Posts