ఇటీవలే ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న “స్పిరిట్” చిత్రం నుంచి దీపికా పదుకోని తప్పుకున్న సంగతి టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమె వర్కింగ్ స్టైల్‌ నచ్చక, సినిమా నుంచి ఆమెను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీపిక మాత్రం ఆ షాక్ నుంచి త్వరగానే బయటపడింది. ఇప్పుడు ఓ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టాలీవుడ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతుంది — అది కూడా బన్నీ సరసన!

‘కల్కి 2898 AD’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత, దీపికా పదుకోని మళ్లీ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఆమె అల్లు అర్జున్‌తో కలిసి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్ వర్కింగ్ టైటిల్ ‘AA22×A6’ గా ఉంది. సుమారు 700 కోట్ల బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం మేరకు దీపికా పదుకోని, అట్లీ మధ్య గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వారు అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. 2023లో విడుదలైన ‘జవాన్’ (600 కోట్లు కలెక్ట్ చేసిన సూపర్ హిట్) తర్వాత ఇది వీరి రెండో కలయిక కావడం విశేషం.

బన్నీ, దీపిక ఇద్దరూ చాలాకాలంగా ఒకదానితో ఒకరు పనిచేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆ కలయిక సాకారమవుతోంది. ‘AA22×A6’ చిత్రం ఒక పారలల్ యూనివర్స్ నేపథ్యంలో, ఓ డబుల్ రోల్‌లో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. దీనికి అమెరికాలోని ప్రముఖ స్పెషల్ ఎఫెక్ట్స్ కంపెనీలు పనిచేస్తుండటంతో, విజువల్‌గా ఇది గ్రౌండ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్ కానుంది.

ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఇతర కథానాయికలుగా నటిస్తున్నారు. మిగిలిన క్యాస్టింగ్ ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతోంది.

, ,
You may also like
Latest Posts from