దక్షిణాది నటులు హిందీ సినిమాల్లో విలన్‌లుగా కనిపించడం కొత్తేమీ కాదు. వింత అసలు కాదు. తాజాగా హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే పుష్ప 2 నటుడు అల్లు అర్జున్ షారూఖ్ ఖాన్ చిత్రంలో విలన్ గా నటించడానికి సిద్ధంగా ఉన్నాడని మేము మీకు చెబితే?నమ్ముతారా
అవును, మీరు సరిగ్గానే చదివారు! అర్జున్ మరియు SRK ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోవటం, ఎత్తుకు పై ఎత్తు వేయటం త్వరలో మనం పెద్ద తెరపై చూడబోతున్నట్లు వార్త్లు వస్తున్నాయి.
బాలీవుడ్ నుంచి వస్తున్న వార్తలు ప్రకారం షారూఖ్ ఖాన్ యొక్క పఠాన్ 2లో అల్లు అర్జున్ నెగిటివ్ రోల్ పోషిస్తాడు.
YRF చిత్రం SRK యొక్క 2023 బ్లాక్ బస్టర్ టైటిల్ పఠాన్‌కి సీక్వెల్. మొదటి చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కూడా నటించారు.