
OG ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో.. మేకర్స్ ఒక్కసారిగా షాకింగ్ మూవ్ చేశారు. నిన్న రాత్రి “వాషి యో వాషి” అనే జపనీస్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ పాటను సుజీత్ రాసి, స్వయంగా పవన్ కళ్యాణ్ చేత పాడించటం స్పెషల్. కానీ ఇది సాధారణ పాటలా కాకుండా, డైలాగ్ మిక్స్‌డ్ మ్యూజిక్ లా వినిపించింది.
ఇక ఇక్కడే స్టార్ట్ అయింది అసలైన వార్! ఎందుకంటే Pushpa 2 ఇంట్రో ఫైట్‌లో అల్లు అర్జున్ కూడా జపనీస్ డైలాగ్స్ చెప్పాడు. దీంతో నెటిజన్లు ఇద్దరినీ పోల్చేస్తున్నారు.
ఒక వర్గం ఫ్యాన్స్ – బన్నీ డిక్షన్ అసలైన జపనీస్ టచ్‌తో ఉందని అంటుంటే,
మరో వర్గం – పవన్ స్టైల్ ఎంటర్‌టైనింగ్‌గా, మాస్ కనెక్ట్ ఎక్కువగా ఉందని ఫిక్స్ అయ్యారు.
ఇక సోషల్ మీడియాలో “అల్లు అర్జున్ vs పవన్ కళ్యాణ్ – జపనీస్ డైలాగ్ బ్యాటిల్” అనే హ్యాష్‌ట్యాగ్ సీరియస్‌గా ట్రెండ్ అవుతోంది.
అంతలోనే రేపు OG ట్రైలర్ రాబోతుండటం, వీకెండ్ నుంచి బుకింగ్స్ ఓపెన్ కావడం తో సినిమా బాక్సాఫీస్‌పై భారీ దుమారం ఖాయం అంటున్నారు ట్రేడ్ సర్కిల్స్.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – జపనీస్‌లో ఎవరి స్టైల్ టాప్? బన్నీనా? లేక పవనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఓజీ (They Call Him OG)” సినిమా పై అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ నుండి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, పాటలు అన్నీ మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై అద్భుతమైన హైప్‌ను కలిగించాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
