సినిమా వార్తలు

రామ్ పోతినేని బోల్డ్ స్టెప్… ఈ రిస్క్ వర్కౌట్ అవుతుందా?

మాస్ హీరో రామ్ పోతినేని ఈసారి సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చాడు. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే — చిన్న సినిమాలైనా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు! కానీ రామ్ మాత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా” కోసం బోల్డ్ నిర్ణయం తీసుకున్నాడు.

ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో కూడా రెగ్యులర్ టికెట్ రేట్లతోనే రిలీజ్! అంటే ₹50–₹100 అదనంగా ఛార్జ్ చేయడం లేదు.

క్రేజ్ ఆల్రెడీ పీక్‌లో!

“ఆంధ్ర కింగ్ తాలూకా”కు ప్రీ రిలీజ్ బజ్ సాలిడ్‌గా ఉంది. చార్ట్‌బస్టర్ సాంగ్స్, హై ఎనర్జీ ట్రైలర్‌తో ఆడియెన్స్‌లో హైప్ క్రియేట్ అయిపోయింది.
రామ్–ఉపేంద్ర కాంబో, మెటా స్టోరీ కాన్సెప్ట్ ఫ్యాన్స్‌కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోందని టాక్.

హీరో రామ్‌కి ఇది ‘డిసైడింగ్ మూవీ’

గత కొన్ని సినిమాలు ఆశించిన రేంజ్‌లో నడవకపోయినా, రామ్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. “ఆంధ్ర కింగ్ తాలూకా” కంటెంట్‌ మీద ఆయనకున్న నమ్మకం చూసి ఫ్యాన్స్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. రామ్ సినిమా రెగ్యులర్ టికెట్ రేట్స్‌ పెంచకుండా వస్తే — మరింతమంది ఆడియెన్స్ థియేటర్స్ వైపు, బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చే ఛాన్స్

Censor: U/A | Runtime: 166 mins

రిలీజ్ డేట్ ఫిక్స్!

సినిమా నవంబర్ 27, గురువారం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. Advance Bookings already ఓపెన్!

Similar Posts