కోట శ్రీనివాసరావు కుటుంబానికి మరో విషాదం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి రుక్మిణి (75) సోమవారం కన్నుమూశారు. కోటి శ్రీనివాసరావు జులై 13న తుది శ్వాస విడిచిన విషయం ఇటీవలీ తెలిసిందే. ఆయన మరణ వార్త మరవకముందే సతీమణి రుక్మిణి కన్నుమూశారన్నది కుటుంబ సభ్యులు, అభిమానులందరినీ గాయపరుస్తోంది.
కోటి శ్రీనివాసరావు 1966లో రుక్మిణితో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దురదృష్టవశాత్తూ, తమ కుమారుడు ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
రుక్మిణి ఒక సందర్భంలో కోటి శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ, ఆయన ఓర్పు ఎక్కువగా ఉన్న వ్యక్తి, అందరితోనూ సరదాగా ఉండేవని పంచుకున్నారు. అలాగే, కోటి నటించిన ‘అహనా పెళ్లంట’ సినిమాను తనకు ఎంతో ఇష్టమైన చిత్రంగా పేర్కొన్నారు.