

ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌లోని ఈస్ట్రన్ ఘాట్స్ అడవుల్లో ఘాటీలు అనే కమ్యూనిటీ జీవిస్తుంటారు. వీరి జీవితం కొండల మధ్య నుంచి సరుకులు మోసుకుంటూ సాగించటం. ఆ కమ్యూనిటీలోంచి వచ్చిన శీలావతి (అనుష్క శెట్టి) బస్ కండక్టర్ గా పని చేస్తుంది. ఆమె బావ దేశి రాజు (విక్రమ్ ప్రభు) ల్యాబ్ టెక్నీషియన్. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. బయటకు వీళ్లకి సాధారణ జాబ్స్ చేసే వాళ్లలా ఉన్నా, లోపల మాత్రం ఒక సీక్రెట్ ఆపరేషన్ నడిపిస్తూ ఉంటారు.
అదేమిటంటే… గంజాయిని లిక్విడ్ రూపంలో మార్చి మార్కెట్లో అమ్మే పని. ఇలా రిస్క్ చేసి స్మగ్నింగ్ యాక్టివిటీస్ చేయటం వెనక ఉన్న వాళ్ల డ్రీమ్ మాత్రం ఒకటే..“మన ఘాటీల జీవితాలు మార్చాలి. ఈ లిక్విడ్ గంజాయ్ మార్కెట్ లో బాగా వర్కవుట్ అవుతుంది. బాగా డబ్బు తెచ్చిపెడుతుంది. అంతేకాదు. ఇదే గంజాయ్ బిజినెస్ లో ఉంటున్న కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), కుందుల నాయుడు (చైతన్య రావు)లను ఎట్రాక్ట్ చేస్తుంది.
వాళ్లు ఇంతకాలం గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను కంట్రోల్ చేస్తున్నవాళ్లు. ఇలా సీక్రెట్ గా వ్యాపారం చేయటంచూసి సహించలేకపోతారు. మొదట వీళ్ల ఎంట్రీని అడ్డుకున్నారు. తర్వాత పార్టనర్‌షిప్ ఆఫర్ ఇచ్చారు. అంతా సవ్యంగా ఉందనుకునే సమయంలో వాళ్లు తమ విశ్వరూపం చూపిస్తారు. దేశి రాజును ఘోరంగా హత్య చేస్తారు. శీలావతిని అవమానానికి గురిచేస్తారు. అప్పుడు ఏమైంది. శీలావతి ఈ నాయుడు బ్రదర్శ్ పై పగ తీర్చుకుందనేది మిగతా కథ.
ఎనాలసిస్
ఎప్పుడైతే ఎలా పగ తీర్చుకుంది అనేది సెకండాఫ్ లో వస్తుందనగానే ఈనాటి ప్రేక్షకుడు..తర్వాత ఏం జరగబోతోందనే విషయన్ని ఇట్టే పసిగట్టేస్తున్నాడు. అక్కడే సినిమాకు దెబ్బ పడుతోంది. సెకండాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్ గా, రొటీన్ గా మారిపోయింది. తెరపై హింస మితిమీరి ఉంటున్నా ఎక్కడా ఉద్రేకపడాలనిపించే క్షణాలు రావు. ఎందుకంటే ఎమోషనల్ కనెక్టవిటీ మనకు కనపడదు. కేవలం నేఫద్యం మాత్రమే ఇప్పటి దాకా తెలుగు తెర మీద రానిది దర్శకుడు క్రిష్ తీసుకువచ్చే ప్రయత్నం చేసారు.
కానీ మిగతాదంతా ఎన్నో ఏళ్లగా తెలుగు ప్రేక్షుకులు చూస్తున్న పగ- ప్రతీకార ఎపిసోడ్స్. ఇంతోటిదానికి ఇంట్రస్ట్ ఏమి అనిపిస్తుంది. పోనీ అదేమన్నా క్వెంటిన్ టొరెంటినో కిల్ బిల్ తరహాలా చేయగలిగారా అంటే అదీ ఏమీ ఉండదు. సీన్స్ వస్తూంటాయి. వెళ్తూంటాయి. కానీ చూస్తున్న మనకు ఏమీ అనిపించదు. ఓ ఎమోషన్ కానీ, థ్రిల్ కానీ అనిపించకపోవటం ఈ సినిమా ప్రత్యేకత.
దర్శకుడుగా…
క్రిష్ సరైన సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. అయితే కొత్త నేపథ్యం ఒక్కటే సినిమాని నిలబెట్టడానికి చాలదు. దానికి తగిన ఎంగేజింగ్ న్యారేటివ్, పకడ్బందీ ప్రెజెంటేషన్ కూడా కావాలి.
ఇదే కీలకమైన అంశంలో క్రిష్ తడబడ్డాడు. కథను పూర్తిగా లీనియర్‌గా చెప్పడం వల్ల “ఘాటి” లో కుతూహలం తగ్గిపోయింది. ప్లాట్ చాలా సింపుల్ – హీరోయిన్ తన ప్రియుడిని విలన్ల చేతిలో కోల్పోతుంది, ప్రతీకారం తీర్చుకుంటుంది, చివరికి తన కమ్యూనిటీకి నాయకురాలిగా మారుతుంది. ఈ టెంప్లేట్-డ్రైవన్ స్క్రీన్‌ప్లే, కొత్త నేపథ్యం ఉన్నప్పటికీ, డ్రామాటిక్ టెన్షన్‌ని పూర్తిగా తగ్గించింది.
స్క్రీన్ ప్లే పరంగా …
ఇంటర్వెల్ ఎపిసోడ్ మినహా, ఫస్ట్ హాఫ్‌లో ఆసక్తి రేకెత్తించే అంశాలు పెద్దగా లేవు. సెకండ్ హాఫ్ రొటీన్ లైన్స్‌లో సాగిపోతూ, ఎక్కడా హై పాయింట్ ఇవ్వలేదు. సాధారణంగా క్రిష్ సినిమాల్లో కనిపించే ఎమోషనల్ పంచ్, ఇక్కడ క్లైమాక్స్‌లో కూడా కనపడకపోవడం పెద్ద లోటు. స్క్రీన్‌ప్లేలో కానీ, యాక్షన్ సీక్వెన్సెస్‌లో కానీ సర్ప్రైజ్‌లు లేకపోవడం మైనస్, అయినా కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగానే మౌంట్ చేశారు.
నటీనటుల్లో ..
అనుష్క శెట్టిని మొదట బాధితురాలిగా, తర్వాత లెజెండ్‌గా మలచాలని క్రిష్ ప్రయత్నించాడు. కానీ ఆర్క్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ పాత్రలో ఆమెకు గుర్తుండిపోయే సీన్స్ ఏవీ లేకపోవడం వల్ల, అనుష్క నటన బాగానే ఉన్నా, ఆమె స్థాయికి తగినంత ప్రత్యేకత చూపలేకపోయింది.
విలన్ ట్రాక్ కూడా నిరాశ కలిగించింది. ముఖ్య విలన్‌గా నటించిన చైతన్య రావు రోల్‌కు సరిపోలకపోవడం వల్ల భయపెట్టలేకపోయాడు. రవీంద్ర విజయ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.
సపోర్టింగ్ క్యాస్ట్‌లో జగపతి బాబు బాగానే చేశాడు. లరిస్సా పాత్రకు సరిపోయింది. మిగతావాళ్లు పెద్దగా గుర్తుండేలా చేయలేదు.
టెక్నికల్ గా…
సాంకేతికంగా ఈ సినిమా కొంతవరకు స్ట్రాంగ్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒడిశా కొండల అందాలు, ప్రొడక్షన్ డిజైన్ రియలిస్టిక్‌గా క్యాప్చర్ అయ్యాయి. కానీ సంగీతం మాత్రం పూర్తిగా ఫ్లాప్. పాటలు ఎటువంటి ఇంప్రెషన్ కలిగించలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సాదాసీదాగా అనిపించింది.
ఫైనల్ థాట్..
ఓ రొటీన్ రివేంజ్ డ్రామాకు ..ఘాటీ అనే నేపధ్యం అద్ది, అనుష్క ని అడ్డం పెట్టి క్రిష్ గెలుద్దామనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. కేవలం నేఫథ్యం ఉంటే చాలదు న్యారేషన్ కూడా కావాలి అని ఈ సినిమా మరో సారి నొక్కి చెప్తుంది.