

‘ఘాటీ’ సినిమాను చాలామంది ‘పుష్ప’ మూవీతో పోలుస్తున్నారు. పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తే, శీలావతి గంజాయి అక్రమ రవాణా చేస్తుంది. దీంతో ఈ సినిమాను ‘పుష్ప’కు ఫిమేల్ వెర్షన్ గా చాలామంది చూస్తున్నారు. దీనిపై ఇటు అల్లు అర్జున్, అటు అనుష్క ఒకేసారి స్పందించారు. ‘ఘాటీ’ సినిమా ప్రచారంలో భాగంగా అనుష్క, బన్నీ మాట్లాడుకున్న ఆడియో టేపును విడుదల చేశారు.
ఘాటి రిలీజ్ ప్రమోషన్స్ లో అనుష్క బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె తన పాత ఫ్రెండ్, వేదం, రుద్రమదేవి సహ నటుడు అల్లు అర్జున్‌తో ఓ హార్ట్‌ఫుల్ చాట్ షేర్ చేసుకున్నారు. ఇద్దరి మధ్యన నవ్వులు, జ్ఞాపకాలు, గౌరవం షేర్ చేసుకున్న ఈ సంభాషణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
అనుష్క, “నా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌కి కారణమైన పాత్రల దగ్గర ఎక్కడో మీరు ఉండటం యాదృచ్ఛికం కాదు” అంటూ బన్నీపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
దానికి బన్నీ రిప్లై ఇస్తూ – “ఈ తరం హీరోయిన్లలో పవర్‌ఫుల్ యాక్షన్ రోల్స్‌ని భయంలేకుండా ఎంచుకునేది మీరు మాత్రమే” అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇక, పుష్పా – శీలావతి క్రాస్‌ఓవర్ మూవీ ఐడియా గురించి మాట్లాడినప్పుడు అనుష్క ఎగ్జైట్ అయిపోగా, అల్లు అర్జున్ వెంటనే ” రెండు పార్ట్ సాగా సినిమా ఉంటే, ఒకదాన్ని సుకుమార్, మరొకదాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది?” అని రిప్లై ఇచ్చారు.
చివరగా, “ఘాటి సినిమా నా ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూస్తాను… నీకు, నీ టీమ్‌కి ఆల్ ది బెస్ట్” అంటూ అనుష్కకు స్పెషల్ సపోర్ట్ తెలిపారు బన్నీ.